Telangana Rain: తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో వానలే వానలు!

ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

New Update
Telangana Rain update

Telangana Rain update

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు వర్షం, మరో వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. తెల్లవారి అయితే ఎండ కుమ్మేస్తుంది. సాయంత్రానికి మబ్బులు కమ్మి వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వీపు వాయించేసిన ఎండ.. ఇప్పుడు వరుణుడు ఉపశమనం కలిగిస్తున్నాడు. 

Telangana Rain

అయితే కొన్ని జిల్లాల్లో రోజూ వానలు పడి ప్రజలను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేస్తున్నాయి. నిన్న (గురువారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే ఇవాళ ఉదయం మళ్లీ ఎండలు దంచికొట్టాయి. ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

రాత్రి 7 గంటల వరకు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆదిలాబాద్, జనగామ, గద్వాల్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలిపింది. 

Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా

 

hyd-rain | latest-telugu-news | rain update | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు