/rtv/media/media_files/2025/04/18/R2oXLz34naogpZ3sqgcU.jpg)
ed dog case Photograph: (ed dog case)
బెంగళూర్‌కు చెందిన ఓ శునక ప్రియుడికి ED బిగ్ షాక్ ఇచ్చింది. ‘కడబాంబ్ ఒకామి’ పేరుగల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొన్నానంటూ సతీశ్ ప్రచారం చేశాడు. దీంతో ఖరీదైన డాగ్ ఆధారలు చూపించాలంటూ నోటీసులూ జారీ చేసింది.
అక్రమ చలామణి దందా..
ఈ మేరకు బెంగళూర్‌లోని జేపీ నగర్‌కు చెందిన సతీష్ అనే వ్యక్తి ఇటీవల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అది వైరల్ కావడంతో దీని వెనుక అక్రమ చలామణి దందా నడుస్తుందనే అనుమానంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. అంత ఖరీదైన కుక్క ఇంట్లో లేకపోవడంతో వెంటనే తమకు చూపించాలని, ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ నోటీసులూ జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
అయితే ఈడీ ఎంట్రీతో కంగుతిన్న సతీష్.. ఆ కుక్క తన వద్ద లేదని వివరణ ఇచ్చాడు. నిజానికి ఆ డాడ్ తాను కొనలేదని, తన ఫ్రెండ్ దగ్గర విడిచిపెట్టానని చెప్పాడు. తాను ఎలాంటి నగదు అక్రమ చలామణి చేయట్లేదని తెలిపాడు. 'ఈ కుక్కలు చాలా అరుదుగా ఉండటం వల్ల నేను వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేశాను. ప్రజలు వీటిని చూడటానికి ఆసక్తిని కనబరుస్తారు కాబట్టి నాకు సోషల్ మీడియా వేదికల్లో కొంత ఆదాయం వస్తుంది. వీటితో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటాయి. సినిమా ప్రదర్శనలో నా కుక్క, నేను నటుడి కంటే ఎక్కువ ఆకర్షించబుతున్నాం' అని సతీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు పలువీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కానీ మరిన్ని కోణాల్లో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
ఇక ఈ 51 ఏళ్ల సతీష్.. అరుదైన పెంపుడు జంతువుల పెంపకం వ్యాపారిగా గుర్తింపుపొందాడు. అందులో భాగంగానే ఫిబ్రవరిలో ఒక బ్రోకర్ ద్వారా ఈ డాడ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కుక్కగా చెప్పబడే ఒకామి వయస్సు కేవలం 8 నెలలు మాత్రమే. కాగా ఇది75 కిలోల బరువు, 30 అంగుళాల పొడవు ఉంది.
Also Read : ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. అసలు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
telugu-news | bengalore | dog | today telugu news | latest-telugu-news | national news in Telugu | business news telugu