Truecaller: ఇక ఫేక్ కాల్స్‌‌కు గుడ్‌బై.. ఈ కొత్త ఫీచర్‌తో ట్రూకాలర్ అవసరం లేదు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అన్నీ నెట్‌వర్క్ కంపెనీలను కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. కాల్ వస్తే.. ఎవరు ఫోన్ చేస్తున్నారో పేరు డిస్ల్పే అవుతుంది. దీంతో ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇక అవసరం లేదు. 

New Update
spam calls

spam calls Photograph: (spam calls)

Truecaller: రాంగ్ నెంబర్స్, కస్టమర్ కేర్ కాల్స్‌తో విసిగిపోతున్నారా.? అయితే మీకో గుడ్‌న్యూస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(Department of Telecommunication) అన్నీ నెట్‌వర్క్ కంపెనీలను వెంటనే కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. దీంతో ఫోన్‌లో ఫీడ్ చేసుకోని నెంబర్స్‌కు కూడా మీకు ఎవరు కాల్స్ చేస్తున్నారో తెలుస్తుంది. ఫేక్ కాల్స్(Fake Calls) కట్టడి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫీచర్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. సిమ్(SIM) తీసుకున్నప్పుడు అయిన రిజిస్ట్రేషన్ ఆధారంగా కాల్ వస్తే.. ఎవరు ఫోన్ చేస్తున్నారో పేరు డిస్ల్పే అవుతుంది. దీనివల్ల ట్రూకాలర్(Truecaller) లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇకపై అవసరం లేదు. 

Also Read: ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్

త్వరలో అందుబాటులోకి CNAP ఫీచర్‌..

ఎయిర్ టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం ఆపరేటర్ కంపెనీలు CNAP ఫీచర్‌ను సంవత్సరం నుంచి టెస్ట్ చేస్తున్నాయి. ఇది కాలర్ రిజిస్టర్డ్ పేరును ప్రదర్శిస్తుంది. ఫేక్ కాల్స్, డిజిటర్ అరెస్ట్, సైబర్ నేరాలు పెరిగిపెతున్నందున ఈ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశించింది. ఫేక్ కాల్స్, సైబర్ మోసాలను తగ్గించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?

CNAP టెక్నాలజీ అమలు చేయాల్సిన అవసరాన్ని చెప్తూ DoT ఇటీవల టెలికాం(Telecom) ఆపరేటర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ ట్రయల్ దశలో ఉంది. CNAP ఫీచర్ SIM కార్డ్ KYC డేటాకు లింక్ చేసిన పేరు చూపిస్తుంది. అయితే, ఈ సేవ 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు