HariHara VeeraMallu
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్- జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 'హరి హర వీరమల్లు'. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ విజయవాడలో జరిగుతోంది. అయితే ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ మేకర్స్ అదిరిపోయే న్యూస్ ఇచ్చారు.
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!
'మాట వినాలి' సాంగ్ వచ్చేసింది..
తాజాగా మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో 'మాట వినాలి' పాటను విడుదల చేశారు. ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం విశేషం. వీరమల్లు మాట చెబితే వినాలి.. అంటూ పవన్ గొంతు సాగిన ఈ పాట ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
#HariHaraVeeraMallu 1st Single is OUT NOW! 🔥 🌪#MaataVinaali - https://t.co/3EDADveTTc#BaatNirali - https://t.co/Qjt5cZ9hW3#KekkanumGuruve - https://t.co/dguxy2HTXx#MaathukeLayya - https://t.co/RaWMyR9HG1#KelkkanamGuruve - https://t.co/tB7YIVj3ze pic.twitter.com/nAAEtihoyc
— Mega Surya Production (@MegaSuryaProd) January 17, 2025
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రానుంది. 2025 మార్చి 28న పేరుతో పార్ట్ 1 రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో పవన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్రం కోసం పోరాడే యోధుడుగా కనిపించనున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.