/rtv/media/media_files/2025/04/19/erC0dvweYIEFv7L4rtBJ.jpg)
delhi-high-court
వివాహేతర సంబంధం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక మహిళను తన భర్త ఆస్తిగా పరిగణించడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలు మహాభారతం కాలంనాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధం నేరమంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ప్రస్తావించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమనీ, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమె ఉదహరించారు.
Also read : Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!
Also read : Urvashi Rautela: నటి ఊర్వశీపై చర్యలు తీసుకోవాలి.. తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న అర్చకులు
Citing Draupadi from Mahabharata, Delhi High Court Quashes Adultery Case Against Man
— LegalWiki (@reallegalwiki) April 18, 2025
The #DelhiHighCourt quashed an #Adultery case under Section 497 IPC.
Read: https://t.co/4uWNdDjvuG pic.twitter.com/F9M7y42iFY
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ప్రస్తుత కేసులో భర్త తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, వారు ఓ హోటల్ లో ఒకరితో ఒకరు శారీరక సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించాడు. అయితే ఈ కేసులో మెజిస్టీరియల్ కోర్టు మహిళ ప్రియుడిని విడుదల చేయగా, సెషన్స్ కోర్టు దానిని పక్కన పెట్టి ప్రియుడికి సమన్లు జారీ చేసింది. అయితే ప్రియుడు దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా కోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేయవచ్చని హైకోర్టు పేర్కొంది.
Also read : Char Dham Yatra: మే 2నకేదార్‌నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
Also Read : Marriage: 60ఏళ్ల వయసులో BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెళ్లి.. ఆమె మరెవరో కాదు!
telugu-news | delhi-high-court | wife-and-husband | Illegal Affair | national news in Telugu | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu