Gas Leak : గ్యాస్ లీక్.. 30 మందికి పైగా తీవ్ర అస్వస్థత.!
తిరుపతి జిల్లా రేణిగుంట ఏర్పెడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్ కు తరలించారు.