China: చైనా చీటింగ్.. పాపం ఇరాన్ ను ఇలా వదిలేసిందేంటి!?

ఇరాన్ మిత్రదేశమైన చైనా.. అమెరికా దాడుల విషయంలో వెనక్కి తగ్గింది. ఈ దాడులను కేవలం మాటలతో విమర్శించింది. కానీ ఇరాన్‌కు సైనిక మద్దతు ఇచ్చే అంశం గురించి మాత్రం చైనా మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే చైనా.. ఇరాన్‌కు హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

New Update
China role in Iran-america war, Know details

China Stance on America attack on iran, Know details

ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్‌కు తన మిత్ర దేశాలైన రష్యా, ఉత్తర కొరియా మద్దతుగా నిలిచినప్పటికీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎలాంటి సాయం చేయలేదు. ఇంతకాలం ఇరాన్‌కు మద్దతిచ్చిన హెజ్‌బొల్లా ఉగ్ర సంస్థ కూడా హ్యాండ్‌ ఇచ్చింది. ఇప్పుడు మరో మిత్రదేశం చైనా కూడా ఇరాన్‌పై దాడుల విషయంలో వెనక్కి తగ్గింది.  ఇటీవల అమెరికా చేసిన దాడులను చైనా విమర్శించింది. 

అమెరికా ఈ దాడులు చేసి ప్రపంచ విశ్వసనీయతను దెబ్బతీసిందని ధ్వజమెత్తింది. ఈ దాడులు అంతర్జాతీయ అణ్వాయుధాల నిరోధక వ్యవస్థకు ముప్పుగా ఉందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్‌కు సైనిక మద్దతు ఇచ్చే అంశం గురించి మాత్రం చైనా మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే చైనా.. ఇరాన్‌కు హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. 

Also Read: అమెరికాలో హై అలర్ట్..యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

చైనా ఇరాన్‌నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇరుదేశాలు కలిసి సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తాయి. చైనా కేవలం అమెరికాను మాటలతోనే ఖండించింది గానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికాతో ఘర్షణకు దిగకూడదని డ్రాగన్ భావించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా చమురు సరఫరాపై కూడా ప్రభావం పడనుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే అమెరికాతో కూడా చైనాకు వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలు ముఖ్యమైనవే. 

అయితే చైనా ఇలాంటి వైఖరి ప్రదర్శించడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఇలా ఇతర దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పడు తటస్థంగా వ్యవహరించింది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా,ఉక్రెయిన్ యుద్ధంలో కూడా చైనా ఇరువైపుల సమతుల్యతను పాటించింది. ఈ రెండు దేశాల్లో దేనికి బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. ఇరాన్ విషయంలో కూడా అలాంటి వైఖరే కనిపిస్తోంది. ఇరాన్‌కు పూర్తిగా మద్దతివ్వడం లేదా అమెరికాకు వ్యతిరేకంగా బహిరంగంగా బయటకు రావడం లేదు. అమెరికాపై విమర్శలు చేయడం కేవలం ప్రపంచ వేదికపై తన ఉనికిని చూపెట్టుకోవడానికే అని స్పష్టమవుతోంది.

Also Read: ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు