BJP MLAs Clash : అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ..వారు లేకపోతే...

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

New Update
Clash between BJP MLAs as the assembly

Clash between BJP MLAs as the assembly

BJP MLAs Clash : వేలాదిమంది ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు తమ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. జనం చూస్తారన్న కనీస సోయిని మరిచిపోయి ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారు. ప్రజలు తమను ఎందుకు గెలిపించారనే విషయాన్ని మరిచిపోయి ప్రజా దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బూతు పురాణంతో రెచ్చి పోయారు. ఒకరిమీద ఒకరు దాడి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వారి తీరును పలువురు వివర్శిస్తున్నారు.

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ‘విజన్ 2047’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాదన చోటు చేసుకుంది.

Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

ఈ సందర్భంగా వారణాసి బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవ, మథుర బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నేను మాట్లాడుతా అంటే నేనంటూ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో ఒకరిపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన తన పేరును స్పీకర్‌కు ఫార్వార్డ్ చేయడం లేదని రాజేష్‌ చౌదరి ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలు విన్న సౌరభ శ్రీవాస్తవ ఒక్కసారిగా తను సీటు నుంచి లేచి ముందు సీటులో కూర్చొన్న సౌరభ్ శ్రీవాస్తవపై దాడి చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. రాజేష్ చౌదరిని అడ్డుకుని సముదాయించారు. ఆయన  రాజేష్‌ చౌదరి పై దాడి చేయకుండా నిలువరించారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది. అయితే ఈ వీడియో ను ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తోంది.

Also Read: India Warning: అనవసరంగా వాగకండి...తీవ్ర పరిణామాలుంటాయి..పాక్ కు భారత్ హెచ్చరిక

అయితే ఈ విషయమై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఘర్షణ పడిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు. అంతేకాక ‘అసభ్యకరమైన ప్రవర్తన’ ‘అసభ్యకరమైన భాషను’ ఉపయోగించే నాయకులను బీజేపీ ప్రోత్సహిస్తున్నది’ అంటూ విమర్శించారు. కాగా ఆయన షేర్‌ చేసినఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.దీంతో బీజేపీ ఎమ్మెల్యేల తీరును పలువురు విమర్శిస్తున్నారు.

Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు