/rtv/media/media_files/2025/08/15/jaiswal-2025-08-15-06-33-53.jpg)
Ranadheer Jaiswal
పాకిస్తాన్ పదే పదే భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. నిర్లక్ష్యపూరిత, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. భారత్ పై పైచేయి సాధించలేక నోరు పారేసుకుంటున్నారు పాక్ నాయకులు. ఇవి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువై పోయాయి. అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. రీసెంట్ గా యూఎస్ పర్యటన చేసిన పాక్ ఆర్మ ఛీఫ్ ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అణు దాడి గురించి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తమ దేశానికి ముప్పు ఉందని భావిస్తే.. అణు దాడులతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని అమెరికా గడ్డ నుంచి ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. మరోవైపు.. తమ దేశానికి చెందాల్సిన ఒక్క చుక్క నీటిని తీసుకునేందుకు భారత్‌కు అవకాశం ఇవ్వబోమని ఆ దేశ ప్రధాని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్ చేశారు.
జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే తీవ్ర పరిణామాలు..
దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ అధికార ప్రతినిధి జైస్వాల్ పాక్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతోందని ఆరోపించారు. దాయాది దేశం తన మాటలను తగ్గించుకుంటే మంచిదని హెచ్చరించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.
#WATCH | Delhi | On Pakistani leadership's comments against India, MEA spokesperson Randhir Jaiswal says, "We have seen reports regarding a continuing pattern of reckless, war-mongering and hateful comments from Pakistani leadership against India. It is a well-known modus… pic.twitter.com/YlmHhIo7lV
— ANI (@ANI) August 14, 2025
భారత్,అమెరికా సమస్యలు తీరుతాయి..
అలాగే భారత్-అమెరికా భాగస్వామ్యం కూడా గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. రెండు దేశాలు అనేక సవాళ్లు, మార్పులను తట్టుకుని నిలబడిందని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగుతామని అన్నారు. భారత్, యూఎస్ మధ్య రక్షణ బాగస్వామ్యం కీలకమైనదని తెలిపారు. ఈ నెలాఖరుకి 2+2 సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేసే పనుల్లో ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని జైస్వాల్ తెలిపారు.