Indipendence Day Special: దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?

ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతా ఆరోజును పండుగా జరుపుకుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం అంతా సైలెన్స్. సీక్రెట్ గా జాతీయ జెండాను ఎగురవేశారు. అలా ఎందుకు జరిగిందో తెలుసా..

New Update
hyderabad fight

1947లో దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ మాత్రం ఇంకా నిజాం పాలనలోనే ఉంది.  ఎందుకంటే అప్పటి సంస్థానాలకు ఫ్రీడమ్ ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినా.. దేశంలో 500 పైగా సంస్థానాలకు మాత్రం దేశంలోనే ఉండాలా వద్దా నిర్ణయించుకునే హక్కును కల్పించారు. దీంతో అప్పటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయనని తెగేసి చెప్పేశారు. తమ రాజ్యం స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు. 

దేశంలో ముగింపు..హైదరాబాద్ లో ప్రారంభం..

అయితే నిజాం పాలకుని నిర్ణయంపై అప్పటి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. అప్పటి కాంగ్రెస్ నేత స్వామి రామానంద తీర్థ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడలని చెప్పారు. ఆయనతో పాటూ బూర్గుల రామకృష్ణరావు వంటి నేతలు కూడా ప్రజా ఉద్యమం చేయడానికి రెడీ అయ్యారు. అయితే దీని గురించి తెలుసుకున్న నిజాం ప్రభుత్వం వారందరినీ జైలుకు పంపింది. అప్పటికే కమ్యూనిస్ట్ నేతల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతోంది. కాంగ్రెస్ నేతల అరెస్ట్ తో ఈ ఉద్యమాన్ని వారు మరింత ఉధృతం చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గెరిల్లా దాడులు చేశారు. భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టారు. నిజాంకు అండగా ఉన్న ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల బృందం గ్రామాలపై పడింది. వారిని నిలువరించి ప్రజలకు అండగా కమ్యూనిస్టులు నిలిచారు.ఖాసిం రజ్వీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు. ఎప్పటికీ హైదరాబాద్ ను భారత్ లో కలపమంటూ మాట్లాడేవాడు. దీంతో రజాకార్ల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యార్ధులు, యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీటన్నింటినీ ఎదుర్కొని ఆగస్టు 15 అర్థరాత్రి దీపపు వెలుగులలో పోరాట నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. నిజాం పాలకులకు సవాల్ విసిరారు. 

ఆ విధంగా ఆగస్టు 15 స్వాతంత్ర పోరాటానికి దేశ ప్రజలకు ముగింపు అయితే..హైదరాబాద్ సంస్థానానికి మాత్రం మొదలుగా నిలిచింది. నిజాం పాలనపై ధిక్కార స్వరం వినిపించిన గుర్తుగా ఉండిపోయింది. ఆ తరువాత నుంచి నిజాం పాలకులపై పోరాటం ఎక్కువైంది. దీనికి భారత సైన్యం కూడా తోడై ఆపరేషన్ పోలో చేపట్టారు. దీంతో 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్...భారత్ లో విలీనమైంది.  

Also Read: India Warning: అనవసరంగా వాగకండి...తీవ్ర పరిణామాలుంటాయి..పాక్ కు భారత్ హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు