/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నేటి నుంచి మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దిశగా కదులుతుంది. దీంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేకపోతే వెళ్లకూడదని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: క్లౌడ్ బరస్ట్.. బీభత్సమైన వరదలు.. 12 మంది స్పాట్ డెడ్!
Daily Weather Inference 15.08.2025
— MasRainman (@MasRainman) August 15, 2025
LPA over North AP/Odissa Another Day of Widespread Moderate/Heavy Rains likely to continue in #AP#Telangana#MP#Vidarbha$Chattisgarh#Odissa#Maharashtra Coastal & Kalayana #Karnataka#Kerala as well. Few Isolated #Thunderstorms expected in… pic.twitter.com/ZtPpwsIcic
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.
#24HrWx
— Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) August 14, 2025
- During next 24 hours, excepting some light rainfall activity over North/East #Telangana and North #AndhraPradesh no serious rainfall situation is expected.
- Next widespread rainfall activity for Telugu states can commence from 17-Aug.
- During last 24 hours… pic.twitter.com/k2QyuQch2t
ఏపీలో ఈ జిల్లాల్లో
ఏపీలో మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు.
ఇది కూడా చూడండి: J&K: జమ్మూ-కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్...46కు చేరిన మృతుల సంఖ్య