Lucknow Chandrika Devi Temple : వామ్మో..ఇదేక్కడి రౌడీయిజంరా నాయనా..ప్రసాదం కొనకపోతే కొట్టేస్తారా?
లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. ప్రసాదం కొనుగోలు చేయలేదని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాల పాలయ్యారు.