/rtv/media/media_files/2025/07/07/anand-mahindra-2025-07-07-21-36-41.jpg)
Anand Mahindra
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈసారి ఓ అందమైన గ్రామం గురించి పంచుకున్నారు. అది కేరళలోని కడమక్కుడి ప్రాంతం.'' ఈ భూమి మీద అత్యంత అందమైన గ్రామాల లిస్ట్‌లో ఇది తరచూ నిలుస్తుంటుందని'' ఆయన రాసుకొచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తాను వ్యాపార పర్యటన నిమిత్తం కొచ్చికి వెళ్తున్నానని.. అయితే తన బకెట్ లిస్ట్‌లో కడమక్కుడి టూర్‌ను కూడా చేర్చానని తెలిపారు.
Kadamakkudy in Kerala.
— anand mahindra (@anandmahindra) July 6, 2025
Often listed amongst the most beautiful villages on earth…
On my bucket list for this December, since I’m scheduled to be on a business trip to Kochi, which is just a half hour away…#SundayWandererpic.twitter.com/cQccgPHrv9
Also Read: ఇస్రో ఛైర్మన్‌తో స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారంటే ?
కొచ్చి నుంచి ఈ గ్రామం అరగంట దూరంలో ఉందని చెప్పారు. దానికి సంబంధించిన అందమైన దృశ్యాలతో కూడిని వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ గ్రామంలో చుట్టు నీరు ఉండగా.. ఆ నీటి పైనే చెట్లు, రోడ్లు, ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ వైరల్ అవుతోంది. చాలా అందమైన గ్రామం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
ఇదిలాఉండగా ఎర్నాకుళం జిల్లాలోని కడమక్కుడి అనేది 14 చిన్న చిన్న దీవులతో కూడిన అందమైన ద్వీప సమూహం. పచ్చని పంట పొలాలు, సుందరమైన ప్రక-తి దృశ్యాలతో కూడిన కేరళ గ్రామీణ జీవనాన్ని ఇక్కడ చూడవచ్చు. కొచ్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో.. అలాగే కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. స్థానిక బస్సులు, ఇతర వాహనాల ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..