/rtv/media/media_files/2025/05/22/yqCeZnwXCdMi5rMFzvuO.jpg)
Bomb threat at Punjab & Haryana High Court
Bomb threat : పహల్గాం లో తీవ్రవాదుల దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో యుద్ధం అంచుల వరకు పోయిన ఇరుదేశాలు కాల్పుల విరమర ఒప్పందాన్ని పాటిస్తు్న్నాయి. అయితే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత మాత్రం కొనసాగుతోంది. దీంతో దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన అయితే అందరిలో ఉంది. ముఖ్యంగా పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలు మాత్రం ఇప్పటికీ బిక్కుబిక్కు మంటూనే గడుపుతున్నారు.
Also Read: భారత్‌లోకి 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం..
ఈ క్రమంలో గురువారం మద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో బాంబు పెట్టామంటూ కొంతమంది బెదిరింపు కాల్స్ చేశారు. విషయం తెలియగానే కోర్టులో ఉన్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. కోర్టు ఆవరణలో అణువణువున తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ, వస్తువులను వేటిని వదల కుండా తనిఖీ చేశారు. కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ హెచ్చరిక నోటీసులు కూడా జారీ చేసింది.
Also Read : కమల్ - శింబు ఫేస్ ఆఫ్.. మణిరత్నం గ్యాంగ్ స్టార్ డ్రామా 'థగ్ లైఫ్' ట్రైలర్
కోర్టు ఆవరణలో ఉన్న వారందరూ అప్రమత్తంగా ఉండాలని, చుట్టు పక్కల పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు లేదా బార్ అసోసియేషన్‌కు సమాచారం అందజేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కాగా ఇంకా కోర్టులో తనిఖీలు కొనసాగుతుండటంతో పలు కేసుల విచారణకు ఆటంకం ఏర్పడింది. అయితే తనిఖీలలో ఇప్పటివరకు ఎలాంటి అనుమానస్పద వస్తువకానీ, వ్యక్తులు కానీ కనిపించలేదని ఎవరో కావాలనే ఆటపట్టించడానికి కాల్ చేసి ఉంటారని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. అదే సమయంలో నేటి కోర్టు కార్యకలాపాలు మధ్యాహ్న భోజనం తరువాత 2 గంటలకు పున:ప్రారంభమవుతాయని బార్ అసోసియేషన్ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!