/rtv/media/media_files/2025/05/21/xDv3MtDON5P1NXnafRZq.jpg)
Cherry Tomatoes
Cherry Tomatoes: టమోటాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చెర్రీ టమోటాలు కూడా అంతే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చిన్నగా కనిపించే చెర్రీ టమోటాలలో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె, చర్మ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఏదైనా చేర్చుకోవాలనుకుంటే చెర్రీ టమోటాలు సరైన ఎంపిక. చెర్రీ టమోటాలు తింటే కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చర్మం ప్రకాశవంతంగా..
చెర్రీ టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. వీటిల్లో లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఎలాంటి నష్టం కలగకూండ చూసుకుంటుంది. చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ చెర్రీ టమోటాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పొరపాటున కూడా వేపాకులను నమలకూడదు.. ముఖ్యంగా ఈ ఏడుగురు ఆ పని చేయకూడదు!
చెర్రీ టమోటాల్లో పొటాషియం, ఫైబర్‌లను కలిగి ఉంది. ఇవి రక్తపోటును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయని చెబుతున్నారు. చెర్రీ టమోటాలలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాబట్టి అవి జీర్ణక్రియను పెంచడంలో, మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే చెర్రీ టమోటాలు మంచివి. వాటిలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే అదనపు కేలరీలను కల్పకుండా కడుపు నిండుగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: బరువు తగ్గించే గింజలు.. వీటితో మాముల ప్రయోజనాలు కాదు.. తప్పక తెలుసుకోండి!
( tomatoes | tomatoes-benefits | health-tips | latest health tips | best-health-tips | latest-news | telugu-news)
ఇది కూడా చదవండి: అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈ విషయంలో బెస్ట్.. స్త్రీలు ఎంత వేగంగా బరువు తగ్గగలరంటే?