Thug Life Trailer: మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ డ్రామా 'థగ్ లైఫ్'. దాదాపు 35 ఏళ్ళ వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. కమల్ హాసన్ తో పాటు సిలంబరసన్ TR, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్ వంటి స్టార్ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
#ThuglifeTrailer Out Now
— Raaj Kamal Films International (@RKFI) May 17, 2025
➡ https://t.co/Xy1tm87OuO#Thugfluencers#ThuglifeAudioLaunch from May 24#Thuglife#ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR #IMAX
A #ManiRatnam Film
An @arrahman Musical@ikamalhaasan @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers… pic.twitter.com/rhp4PAmetE
థగ్ లైఫ్ ట్రైలర్
2 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్, నమ్మకం, ద్రోహం వంటి అంశాలతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇందులో కమల్ - శింబు మధ్య బంధాన్ని చూపించారు. తండ్రికొడుకులుగా ఉన్న వీరి బంధం శత్రుత్వంగా ఎలా మారింది అనేది ప్రేక్షకులలో సస్పెన్స్ రేకెత్తిస్తోంది. అలాగే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ హైలైట్ గా ఉన్నాయి. ఇందులో కమల్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు.
1987లో కమల్ - మణిరత్నం కాంబోలో 'నాయకుడు' ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. దీంతో ఇప్పుడు రాబోతున్న 'థగ్ లైఫ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
telugu-news | latest-news | thug-life-movie