Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

తమిళస్టార్ ధనుష్ వరుసపెట్టి బయోపిక్ లలో నటిస్తున్నారు. ఇప్పటికే ఇళయరాజా సినిమాలో నటిస్తున్న ధనుష ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ కు సైన్ చేశారు. కలాం పేరుతో తీస్తున్న ఈ సినిమాకు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. 

New Update
cinema

Kalam Movie

తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ధనుష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం బయోపిక్. కలాం అనే పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఆది పురుష డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తమిళస్టార్ ధనుష్ ఇందులో కలాం గా నటిస్తున్నాడు. ఇందులో అబ్దుల్ కలాం షాడో పిక్ ను అణుబాంబు పేలుతున్న వద్ద డిజైన్ చేసి చూపించారు. ఈ మూవీని అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, భూషన్ కుమార్, క్రిషాన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కలాం జీవితం మొత్తం.. 

త్వరలోనే కలాం మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇందులో అబ్దుల్ కలాం జీవితం మొత్తం చూపించనున్నారు. ఆయన రామేశ్వరంలో పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రపతిగా ఎలా ఎదిగారు వరకు అన్నీ చూపించనున్నారు.  ఆది పురుష్ తో బాక్సా ఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ ఓం రౌత్ కలాం మూవీతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఆది పురుష్ తర్వాత ఆయన తీస్తున్న సినిమా కూడా ఇదే. ఇక ధనుష్ ప్రస్తుతం తెలుగులో కుబేర సినిమాలో నటిస్తున్నారు. అది కాక ఇళయరాజా బయోపిక్ కూడా చేస్తున్నారు. కుబేర జూన్ లో రిలీజ్ అవ్వగానే కలాం మూవీని పట్టాలెక్కించనున్నారు.  

today-latest-news-in-telugu | dhanush | new-movie | apj-abdul-kalam | boipic 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు