/rtv/media/media_files/2025/08/13/sonia-gandhi-2025-08-13-15-15-38.jpg)
BJP Alleges Sonia Gandhi's Name Added To Voter List Before She Was Citizen
ప్రస్తుతం ఓట్ల చోరీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బీజేపీ(BJP), ఎన్నికల సంఘం(EC) కలిసి.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ఇటీవల విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌లో మహదేవపుర నియోజకవర్గంలో బీజేపీ లక్షకు పైగా ఓట్లు చోరీ చేసినట్లు రాహుల్ విమర్శించారు. బీజేపీ ఇలాంటి మోసాలకు పాల్పడి ఎన్నికల్లో గెలుస్తోందని ధ్వజమెత్తారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో మోసాలకు పాల్పడినట్లు బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.
Also Read: ధర్మస్థల కేసులో సంచలన అప్‌డేట్.. 13వ స్పాట్‌లో 8 మృతదేహలు
BJP Alleges Sonia Gandhi's Name Added To Voter List
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) కి గతంలో భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో ఆమె పేరు ఉందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పౌరసత్వం లేనివారికి ఇలా ఓటు హక్కు ఎలా కల్పించారంటూ ప్రశ్నించారు. '' సోనియా గాంధీకి భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఓటర్ల లిస్టులో ఆమె పేరుంది. అప్పటికీ ఆమెకు ఇటాలియన్ పౌరసత్వమే ఉంది. ఆ సమయంలో ఓటర్ల లిస్టులో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీలతో సహా ఆమె పేరును కూడా చేర్చారు.
దీనికి వ్యతిరేకంగా 1982లో నిరసనలు కూడా జరిగాయి. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె పేరును తొలగించింది. ఆ తర్వాత 1983 జనవరిలో మళ్లీ ఆమె పేరు చేర్చారు. అదే ఏడాది ఏప్రిల్ 30న సోనియాగాంధీకి భారత పౌరసత్వం మంజూరు చేశారు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసాలకు పాల్పడింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని'' అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.
ఇదిలాఉండగా బిహార్‌లో ఇటీవల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను కూడా విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి . 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు విమర్శలు చేస్తున్నాయి. మంగళవారం పార్లమెంట్ బయట మింతా దేవి అనే మహిళా ఓటరు ఫొటోతో టీ షర్టులు ధరించి నిరసనలు కూడా చేశారు. అయితే కాంగ్రెస్ నేతల ఆందోళన వల్ల మీడియా వాళ్లు తమ ఇంటికి వచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారని మింతా దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా పర్మిషన్ లేకుండా ఫొటోలు ఎలా ముద్రిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. గృహిణికి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఎలాంటి పర్మిషన్ లేకుండానే కాంగ్రెస్ నేతలు బయటకు ఎలా విడుదల చేస్తారంటూ మండిపడ్డారు. దీనికి క్షమాపణలు చెబుతారా అంటూ ప్రశ్నించారు.
Also read: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..
మరోవైపు ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన 300 మందికి పైగా ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఓట్ల చోరీ వ్యవహారంపై చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల్లో నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయని పలువురు నెటిజన్లు బీజేపీ, ఈసీపై విమర్శలు చేస్తున్నారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
congress | vote chori protest | election-commission | rtv-news | telugu-news | latest-telugu-news | national news in Telugu