/rtv/media/media_files/2025/08/13/dharmasthala-case-2025-08-13-13-49-34.jpg)
Dharmasthala mass burial case, SIT uses GPR at Site No. 13
కర్ణాటకలోని ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారం మేరకు గత కొన్నిరోజులుగా నేత్రావది నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో 13వ స్పాట్ వద్ద 8 మృతదేహాలు ఖననం చేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో GPR -గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్‌తో సెర్చింగ్ చేస్తున్నారు. మృతదేహాలు గుర్తించేందుకు GPR సెన్సార్ల ద్వారా సిగ్నల్స్ రికార్డు చేస్తున్నారు. వర్షంలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఆనవాళ్ల కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటిదాకా 16 స్పాట్‌లలో సిట్ తవ్వకాలు జరిపింది.
తొలిసారిగా సిట్ అధికారులు 13వ స్పాట్ వద్ద డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో సెర్చ్ చేస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా భూమిలోకి సిగ్నల్స్ పంపిస్తారు. సెన్సార్ల ద్వారా వస్తున్న డేటాను రికార్డు చేస్తారు. రేడార్లు ఇచ్చే సమాచారంతో 2డీ, 3డీ ఇమేజింగ్ చేస్తారు. నది ప్రాంతంలోని భూమిలోపల ఉండే ఏ వస్తువునైనా కూడా ఈ సాంకేతికతో గుర్తిస్తారు. అయితే 13వ స్పాట్ ఇప్పుడు కీలకంగా మారింది. భారీ భద్రత నడుమ అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.
Also Read: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..
🚨 Big developments in #Dharmasthala probe — #SIT deploys Ground Penetrating Radar at site no.13 near Netravati bathing ghat. High-tech investigation underway to uncover the truth beneath the surface. ⚠️🔍 #GPR#Investigationpic.twitter.com/nVCMgUksHo
— Citizen MattersX (@CitizenMattersX) August 12, 2025
Also Read: ముందు చైనా..తరువాత అమెరికా ..టారీఫ్ లపై పక్కా ప్లాన్ తో భారత ప్రధాని మోదీ
ఇదిలాఉండగా ధర్మస్థల ప్రాంతంలో 1995 నుంచి 2014 మధ్య వందలాది మందిని సామూహికంగా పాతిపెట్టాని జూన్ 3న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పాతిపెట్టిన మృతేహాల్లో హత్య, అత్యాచారానికి గురైన యువతులు, మహిళలవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గతంలో తాను ధర్మస్థలిలోనే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. జులై 11న బెళ్తంగడి న్యాయస్థానం ముందు కూడా అతడు హాజరై ఈ వ్యవహారానికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చాడు.
Also Read: 2 మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పై విద్యార్థి దారుణం..
గతంలో తాను పాతిపెట్టిన ఓ మృతదేహా అస్థిపంజర అవశేషాలతో పాటు సంబంధిత ఫొటోలను కూడా పోలీసులకు సమర్పించాడు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. నేత్రవాది నది తీరం వెంట ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టింది. గత కొన్నిరోజులుగా ఈ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు పలు చోట్ల మానవ అవశేషాలు కూడా బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.