UP: యూపీలో ఊపందుకున్న కుల రాజకీయాలు ..హోటల్ లో 40 మంది ఠాకూర్ ఎమ్మెల్యేల సమావేశం..

ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా  ఓ హోటల్ లో ఠాకూర్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు సమావేశం అవడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇరువురు నేతలూ ఉండడం గమనార్హం.

New Update
UP

Thakur Leaders Meet In UP

యూపీలోని యోగి ప్రభుత్వంలో మార్పులు జరగనున్నాయా..అక్కడి బీజేపీ పార్టీలో నేతలు మారనున్నారా అంటే...అవకాశం ఉందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అక్కడి ఠాకూర్ వర్గానికి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కలవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక,దాదాపు ఎనిమిది ఏళ్ళ తర్వాత ఠాకూర్ నేతలందరూ సమావేశం అవడం ఇదే మొదటి సారి. వీరందరూ లక్నోలోని అవధ్ అనే హోటల్ లో కలిశారు. అంతే కాదు అందరికీ కలిపి కుటుంబ్ అనే పరుతోనే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ జైపాల్ సింగ్ వ్యాప్, కుందర్కి ఎమ్మెల్యే ఠాకూర్ రాంవీర్ సింగ్  దీనికి ముఖ్య కారణమని తెలుస్తోంది. ఈ సమావేశానికి చెందిన పోస్టర్ లో కూడా వీరిద్దరి చిత్రాలే ప్రముఖంగా ఉన్నాయి. 

ఎందుకు కలిశారు..

యూపీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు ఈ సమాశంలో పాల్గొన్నారు. ఇందులో ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ ఠాకూర్ అంటూ యూపీలో క్షత్రియ వర్గానికి చెందిన వారు. ఇందులో ఎమ్మెల్యేలందరినీ ఘనంగా సత్కరించారు. దాంతో పాటూ మహారాణా ప్రతాప్, పెద్ద ఇత్తడి త్రిశూలాలను బహుమతిగా ఇచ్చారు. బయటకు చెప్పడానికి దీనిని ఠాకూర్ రాంవీర్ పుట్టిన రోజు అని చెబుతున్నారు. ఇదొక కుటంబ సమావేశం అంటున్నారు. కానీ వెనుక మరో పరమార్థం ఉందని అంటున్నారు. 

ఆధిపత్యం, పదవుల కోసమే..

చాలా కాలంగా యూపీ రాజకీయాల్లో తమ బలాన్ని చాటుకోవాలని అక్కడి ఠాకూర్ లు భావిస్తున్నారు. వీళ్ళు చాలా మందే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి పదవుల్లో ఉన్నా పెద్దగా చెప్పుకోవడానికి లేదు అన్నట్టు ఉంది వారి పరిస్థితి. యోగి నేతృత్వంలో అంతా సైలెంట్ గా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో యోగి మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశంతో పాటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా చేపట్టనున్నారు. ఇవి ఠాకూర్ నేతలకే దగ్గాలన్నది వారి ఆశ. దాని కోసమే ఈ ప్రత్యేక సమావేశం అని చెబుతున్నారు. యూపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న మొదటిరోజునే ఈ మీటింగ్ అవడంతో..కన్ఫర్మ్ గా పదవుల కోసమే అని అంటున్నారు. దీంతో పాటూ ఠాకూర్ లందరూ ఏకమవ్వడం కూడా ముఖ్యమని వారు భావిస్తున్నారు. అందుకే లక్నోలో జరిగిన కుటుంబ్ మీటింగ్ కు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్సీ రాకేష్ ప్రతాప్ సింగ్, ఎమ్మెల్యే అభయ్ సింగ్, బీఎస్పీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే అభిజీత్ సంగ, ఎమ్మెల్సీ శైలేంద్ర ప్రతాప్ సింగ్ సహా 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 'కుటుంబ పరివార్' సమావేశానికి హాజరయ్యారు. ఈ క్షత్రియ ఎమ్మెల్యేల సమావేశానికి బిజెపి ఎమ్మెల్సీ జైపాల్ సింగ్ వ్యాస్, కుందర్కి ఎమ్మెల్యే ఠాకూర్ రాంవీర్ సింగ్.. పిలుపునిచ్చినప్పటికీ..గౌరీగంజ్‌కు చెందిన ఎస్పీ తిరుగుబాటు ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్, గోసాయిగంజ్‌కు చెందిన అభయ్ సింగ్ తెర వెనుక ముఖ్యమైన పాత్ర పోషించారని చెబుతున్నారు. 

Also Read: US-PAK: భారత్ ను రెచ్చగొడుతున్న అమెరికా..ఉగ్రవాదాన్ని అణిచిందంటూ పాక్ పై ప్రశంసలు

Advertisment
తాజా కథనాలు