Sabarimala Gold Case: శబరిమల చోరీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్‌

శబరిమల బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శబరిమల తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సిట్‌ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకొని.. విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం.

New Update
FotoJet (11)

Sabarimala theft case.. temple chief priest arrested

Sabarimala Gold Case:  శబరిమల బంగారం తాపడాల కేసు(Sabarimala gold theft case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శబరిమల తంత్రి (ప్రధాన పూజారి)(chief-priest) కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు(arrested) చేశారు. అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సిట్‌ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకొని.. విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో సన్నిహిత సంబంధం, బంగారు దోపిడీలో అతనికి కీలక ప్రమేయం ఉన్నట్లు సూచించే ఆధారాల ఆధారంగా శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హెచ్ వెంకటేష్ నేతృత్వంలోని విచారణ బృందం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మొదట అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వరకూ రాజీవరును విచారించగా.. ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. బంగారు తాపడాల చోరీ కేసు(gold-theft) లో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఉన్ని కృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని చెబుతున్నారు.  ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో  కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారు తాపడాల దొంగతనం గురించి ఆయనకు ముందే తెలుసని సిట్‌ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

సిట్ సమర్పించిన రెండు ఛార్జ్ షీట్లను ఒకే కేసుగా మార్చడంతో ఈడీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేసింది. రెండు ఛార్జ్ షీట్లలో మొత్తం 15 మంది నిందితుల పేర్లను చేర్చారు. శబరిమల ఆలయం బంగారం చోరీ కేసులో సిట్ ఇప్పటి వరకూ 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, PMLA నిబంధనలను అమలు చేయడం ద్వారా.. నేరంతో పాటు వచ్చిన ఆరోపణలను కనిపెట్టేందుకు, మనీలాండరింగ్ ను పరిశీలించేందుకు ఈడీ దర్యాప్తు పరిధిని విస్తృతం చేయడం ద్వారా విచారణలో నేరం చేసినట్లు తేలితే ఆస్తులను అటాచ్ చేసే అధికారం ఏజెన్సీకి ఉంటుంది.

Also Read :  కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?

ఇంతకు ఏం జరిగిందంటే?

శబరిమలలో మరమ్మత్తుల కోసం గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో తొలగించారు. కాగా వాటిని సరిచేయించి ఆలయానికి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్ని కృష్ణన్‌ అనే దాత తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కాగా ఆపనిని చెన్నై లోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో తాపడాలను తొలగించే సమయంలో వాటి బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఎలక్ట్రోప్లేటింగ్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ గుర్తించింది. తాపడాల బరువు దాదాపు ఒక్కసారిగా4.524 కేజీలు తగ్గడంతో తాపడాల విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్‌ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు చేపట్టింది.

కాగా,  కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ పరిణామం రాజకీయ దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్దిరోజులుగా విచారణకు రావలసిందిగా రాజీవర్ కు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కావడం లేదని, దీంతో సిట్ అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తేలింది. ఇన్నాళ్లు సదరు తంత్రి సమన్ల నుంచి తప్పించుకుంటున్నారని, అందుకే ఈ కేసులో విచారించేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.

Also Read :  ఐఐటీ మద్రాస్‌లో పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌

Advertisment
తాజా కథనాలు