/rtv/media/media_files/2026/01/09/param-shakti-supercomputing-system-launched-in-iit-madras-2026-01-09-06-48-00.jpg)
Param Shakti Supercomputing System Launched In IIT Madras
ఐఐటీ మద్రాస్(iit-madras) లో మరో కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్(Petaflop PARAM Rudra Supercomputing System) అందుబాటులోకి వచ్చింది. సీ డాక్ రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ సిస్టన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ లాంటి రంగాల్లో ప్రపంచస్థాయిలో పోటీ పడేందుకు వీలుగా ఉండనుందని చెప్పింది. కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఇటీవల ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
Also Read: చనిపోయిన భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్.. విదేశీ కరెన్సీ కూడా
Param Shakti Supercomputing System Launched
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమ్ శక్తి పేరుతో ప్రారంభమైన అత్యాధునిక సిస్టమ్‌ను పరిశోధకులు వినియోగించుకోవచ్చని తెలిపారు. దీని ప్రారంభోత్సవంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ఆచార్యులు వి.కామకోటి, సీ-డాక్ డైరెక్టర్ ఇ.మగేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: భారీగా పెరిగిన MPల ఆస్తులు.. రాహుల్ గాంధీ 117%, ప్రధాని మోదీ 80%
Follow Us