Kuwait: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.

New Update
two-indians-get-death-penalty-in-kuwait-for-drug-trafficking

two-indians-get-death-penalty-in-kuwait-for-drug-trafficking

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు(Drug Trafficking) లో కువైట్‌(kuwait) లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. అయితే వాళ్లిద్దరూ ఏ రాష్ట్రానికి చెందినవారు అనేదానిపై క్లారిటీ లేదు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాద మోపాలని కువైట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే అక్కడి అంతర్గత వ్యవహారాల శాఖ ఇటీవల ఓ స్పెషల్ ఆపరేషన్‌ను చేపట్టింది. 

Two Indians Get Death Penalty In Kuwait

ఇందులో భాగంగానే కైఫాన్, షువైఖ్‌ ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిఘా పెట్టారు. ఇద్దరు భారతీయులను అరెస్టు చేశారు. వీళ్ల నుంచి  14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో తెలింది. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రాసిక్యూటర్లు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే నిందితులను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Also Read: వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి.. ట్రంప్ కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు