Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
శబరిమల భక్తులకు అలెర్ట్.. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది.
ఏపీ భక్తులపై అక్కడి భద్రతా సిబ్బంది అత్యంత అమానుషంగా, దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
శబరిమలలో భారీ రద్దీ నెలకొంది. ఈ కారణంగా ఒక మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయి మరణించింది. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటలకు పెరిగింది.
శబరిమల ఆలయం నుంచి 474.90 గ్రాముల బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం తీవ్రం కావడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
శబరిమల ఆలయంలో మరో బంగారం స్కామ్ జరిగింది. గర్భగుడిలో ఉండాల్సిన పవిత్రమైన దండం మిస్ అయినట్లు తెలుస్తోంది. బంగారు పూత కోసం తీసుకెళ్లిన యోగదండం, ఏకముఖి రుద్రాక్ష మాల కనిపించడం లేదని, రికార్డుల్లో కూడా లేదని సమాచారం.
ట్రావెన్కోర్ దేవస్థానం ప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా భక్తులు శబరిమల వెళ్లకుండానే భక్తులు తన ఇంటి నుంచి ప్రసాదాలు బుక్ చేసుకోవచ్చు.
శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాల నుంచి దాదాపు 4.54 కిలోల బంగారం మాయమైన వ్యవహారంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఆలయ పవిత్రతను, పారదర్శకతను దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని ట్రావెన్కోర్ దేవస్థానం ప్రారంభించింది. అయితే ఈ బంగారు లాకెట్లను WWW.Sabarimalaonline.org వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నగదు చెల్లింపును అక్కడికి వెళ్లి చూపిస్తే గోల్డెన్ లాకెట్ అందజేస్తారు.