/rtv/media/media_files/2025/08/24/kukatpally-sahasra-case-2025-08-24-09-31-47.jpg)
Kukatpally Sahasra Case
Kukatpally Sahasra Murder Case: సిఐడి ఆఫీసర్ అవుతానని చెప్పుకునే వాడు.. క్రైమ్ సిరీస్ లు వెబ్ సిరీస్ లు చూసేవాడు.. సిఐడి లెవెల్ లోనే ఆలోచించేవాడు. కానీ అదే దారిలో తప్పటి అడుగేసాడు.. కూకట్పల్లి సహస్ర హత్య కేసులో దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి.. సినిమాలు వెబ్ సిరీస్ లో చూసి ప్రేరణ పొందిన బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేశాడని తెలియడం సంచలనం రేపుతోంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
రూ.. 500 పెట్టి ఫోన్ ..
ఈ కేసు విచారణలో బాలుడు చెబుతున్న విషయాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 500 రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ లో ఒక పాత ఫోన్ కొనుక్కొని.. దాంట్లో క్రైమ్ వీడియోలు చూసేవాడట ఈ బాలుడు. అయితే నిందితుడు చిన్నప్పటి నుంచి తనను తాను ఒక సీఏడీ ఆఫీసర్ గా భావించుకునేవాడట. ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ తాను పెద్దయిన తర్వాత సీఏడీ ఆఫీసర్ అవుతానని చేబుతుండేవాడని దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం తన బ్యాట్ విరగొట్టావని ఓ బాలుడిని బెదిరించి 500 రూపాయలు వసూలు చేశాడు. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ లో ఒక పాత ఫోన్ కొన్నాడు. ఇక్కడితో ఆగలేదు..! అందులో హత్య, క్రైమ్, నేరాలు వీడియోలు చూడడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన తల్లి అతడి నుంచి ఫోన్ లాక్కొని స్విచ్చాఫ్ చేసిందట. ఫ్రెండ్స్ తో ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన వయసులో.. ఈ కుర్రాడి మైండ్ సెట్, ఆలోచన విధానం సమాజంతో పాటు తోటి తల్లిదండ్రులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన పిల్లల్లో సోషల్ మీడియా, ఓటీటీల ప్రభావం పై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
అసలేం జరిగింది..
కూకట్ పల్లి వసంత్ నగర్ లో నివాసం ఉంటున్న సహస్ర అనే బాలికను ఆమె ఇంటి పక్కనే ఉంటున్న పదవ తరగతి బాలుడు కత్తితో పొడిచి చంపేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం సహస్ర తమ్ముడితో MRF క్రికెట్ బ్యాట్ చూసిన ఈ బాలుడు(నిందితుడు) దానిపై ఆశపడ్డాడు. ఒకసారి ఆడుకొనిస్తాను ఇవ్వవా.. అంటూ బాలిక తమ్ముడిని అడిగాడు. కానీ అందుకు సహస్ర తమ్ముడు నిరాకరించాడు. దీంతో ఎలాగైనా ఆ బ్యాట్ తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు నిందిత బాలుడు. ఈ క్రమంలోనే దొంగతనం స్కెచ్ వేశాడు. సహస్ర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బ్యాక్ డోర్ నుంచి ఇంట్లోకి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్లినప్పుడు ఎవరైనా చూస్తే బెదరించాలని తన వెంట కత్తిని కూడా తీసుకెళ్లాడు.
ప్లాన్ ప్రకారం ఆ బాలుడు ఇంట్లోకి వెళ్లిన బ్యాట్ తీసుకొని వస్తుండగా అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అప్పటికే ఇంట్లో ఉన్న సహస్ర ఆ బాలుడు దొంగతనం చేయడం చూసేసింది. మా డాడీకి చెప్తానంటూ బాలుడిని బెదిరించింది. దీంతో ఆ పిల్లాడు భయపడిపోయి తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను పొడిచేశాడు. ఆ తర్వాత ఎలాంటి సాక్ష్యాలు దొరక్కుండా కత్తిని నీటిలో కడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలీసులు ఇంటి చుట్టూ పక్కన వారిని జనరల్ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా తనకేమి తెలియనట్లుగా నటించాడు. కానీ, అదే ఏరియాలో నివాసం ఉంటున్న మరో వ్యక్తి.. బాలిక చనిపోయిన సమయంలో ఈ బాలుడు ఆ పాప ఇంటి నుంచి గోడ దూకడం గమనించినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలుడి ఇంటికెళ్లి ఇన్వెస్టిగేట్ చేయగా అసలు విషయం బయటపడింది. బాలుడి ఇంట్లో సహస్ర తమ్ముడి క్రికెట్ బ్యాట్, అలాగే దొంగతనం ఎలా చేయాలని పేపర్ పై ప్రిపేర్ చేసుకున్న ప్లాన్ దొరికాయి. అబ్బాయి కూడా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. క్రికెట్ బ్యాట్ కోసం 15 ఏళ్ల బాలుడు పదేళ్ల బాలికను హత్య చేయడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఓటీటీలో క్రైమ్ సీరీస్ లు, నేరాల వీడియోలు చూసే ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్లో మరో గురుమూర్తి.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసి