/rtv/media/media_files/2025/08/24/deepika-padukone-2025-08-24-11-13-53.jpg)
deepika padukone
Deepika Padukone Baby: బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ జంట గతేడాది సెప్టెంబర్ లో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు దీపికా తన కూతురు 'దువా' ఫేస్ రివీల్ చేయలేదు. ఈ దంపతులు తమ బిడ్డ కోసం 'నో ఫొటో పాలసీని' ఎంచుకున్నారు. ఈ మధ్య చాలా మంది సెలెబ్రెటీలు దీనినే ఫాలో అవుతున్నారు. 'నో ఫొటో పాలసీ' అంటే పిల్లల మొహాలను బహిర్గతం చేయకుండా ఉండడం. పిల్లల మొహాలను రివీల్ చేయడం ద్వారా వారి ముఖాలను సోషల్ మీడియాలో రకరకాలుగా వాడుతున్నారు కొందరు నెటిజన్లు. దీంతో దీపికా- రణ్వీర్ కూడా పాప్స్ కి తమ కూతురి వీడియోలను పోస్ట్ చేయవద్దని అభ్యర్థించారు.
దువా ఫేస్ వీడియో..
ఈ క్రమంలో దీపికా కూతురు దువా మొహం అనుకోకుండా రివీల్ అవ్వడం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇటీవలే దీపికా తన కూతురితో ఎయిర్పోర్ట్ లో కనిపించగా.. పాప్స్ (వీడియో గ్రాఫర్లు) ఆమెను వీడియో తీశారు. దువా బ్లూ కలర్ టోన్ల కో-ఆర్డర్ సెట్‌లో అలంకరించబడి దీపిక ఒడిలో కూర్చుని ఉంది. ఇది గమనించిన దీపికా తన కూతురు మొహం కనిపించకూడదని వెంటనే రికార్డింగ్ ఆపేసింది. అలాగే వీడియో తీసిన వ్యక్తిపై చిరాకు పడింది దీపికా!
Deepika Padukone with her newly born baby girl, ‘Dua’ seen today at a private airport! 🥹❤️#DeepikaPadukone#Dua#DuaSinghPadukonepic.twitter.com/kSABA9OBGn
— Bollywood Now (@BollywoodNow) December 9, 2024
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ తమ బిడ్డ ప్రైవసీ కోరుకుంటున్నప్పుడు, దానిని గౌరవించాలని కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీల పిల్లల విషయంలో వారి తల్లిదండ్రుల అభ్యర్థనలను గౌరవించడం చాలా ముఖ్యమని అభిమానులు అభిపాయపడుతున్నారు. గతంలో విరాట్, అనుష్క కూడా తమ పిల్లలు విషయంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు.
ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది దీపిక తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా ఇది . దీనికి ముందు ప్రభాస్- నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898Ad సినిమతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో దీపిక నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది దీపిక. దీంతో అట్లీ సినిమాలో దీపిక రోల్ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ ఇప్పటివరకు కనిపించని ఒక డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారని టాక్. ఇది మాత్రమే కాదు ఈ సినిమాలో మృణాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.