West Bengal: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి

పశ్చిమ బెంగాల్‌లో దారుణం వెలుగుచూసింది. అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకోని పోలీసులను ఆశ్రయించింది.

New Update
Bengal Woman Confined, Tortured By Man, His Mother For Refusing To Do Porn

Bengal Woman Confined, Tortured By Man, His Mother For Refusing To Do Porn

పశ్చిమ బెంగాల్‌లో దారుణం వెలుగుచూసింది. అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకోని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్వేతాఖాన్, ఆర్యన్‌ఖాన్ అనే తల్లీ కుమారులు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ముసుగులో అశ్లీల వీడియోల రాకెట్‌ను నడుపుతున్నారు. 

Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో

West Bengal Crime

ఇందుకు సంబంధించిన ఫిల్మ్‌ ప్రొడక్షన్ హౌస్‌ను కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ జీతం ఇస్తామని ఆశ చూపించి నిరుద్యోగ యువతులను ఉద్యోగం పేరుతో నమ్మించేవారు. ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని వాళ్లని బలవంతం చేసేవారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగణా జిల్లాకు చెందిన ఓ యువతి జాబ్‌ కోసం ఫేస్‌బుక్‌లో ఆర్యన్‌ను సంప్రదించింది. హౌరాలో తమ ఇంటికి వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని అతడు నమ్మించాడు. దీంతో ఉద్యోగం కోసం ఆమె అతడి ఇంటికి వెళ్లింది.  

Also Read: బెంగుళూరు తొక్కిసలాట కారణంగా స్టేడియం తరలింపు!!

Also Read :  కేరళ కోజికోడ్‌ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు

ఆర్యన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్‌ డాన్సర్‌గా పనిలోకి దించేందుకు యత్నించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతిపై దాడి చేసి మొబైల్‌ లాక్కొని, ఓ ఫ్లాట్‌లో బంధించారు. ఆరు నెలల పాటుగా తనను ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టి, హింసించేవారు. అంతేకాదు కేవలం నాలుగు రోజులకొకసారి మత్రమే భోజనం పెట్టేవారు. ఈ విషయాలన్ని బాధితురాలు పోలీసులకు వివరించింది. అయితే  ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. వాళ్లు సెక్స్ రాకెట్‌ కూడా నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు.     

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

 

telugu-news | rtv-news | rape | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు