Chinnaswamy Stadium: బెంగుళూరు తొక్కిసలాట కారణంగా స్టేడియం తరలింపు!!

చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట నేపథ్యంలో స్టేడియాన్ని వేరే చోటుకు తరలించే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. స్టేడియం వేరే చోటుకు మార్చాలంటే ముందుగా దానికి తగిన ప్రదేశాన్ని గుర్తించాలని సీఎం సిద్దరామయ్య అన్నారు.

New Update
Chinnaswamy Stadium after

చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట నేపథ్యంలో స్టేడియాన్ని వేరే చోటుకు తరలించే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. జూన్ 4న జరిగిన RCB విజయోత్సవ ర్యాలీలో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 56 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం హయాంలో కూడా ఇలాంటి సంఘటన జరగకూడదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని హామీ ఇచ్చారు.

భద్రతా కారణాల దృష్ట్యా క్రికెట్ స్టేడియంను వేరే ప్రదేశానికి మార్చాలనే డిమాండ్ గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సూచనను పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే,  స్టేడియం వేరే చోటుకు మార్చాలంటే ముందుగా దానికి తగిన ప్రదేశాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకోవడం, పెద్ద ఎత్తున జరిగే ప్రజా కార్యక్రమాలలో భద్రతా చర్యలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. 

Advertisment
తాజా కథనాలు