/rtv/media/media_files/2025/06/09/Vu5Ft6uxRoGNdfb1Fvyb.jpg)
Trump's Tumble On Air Force One Leaves Internet In Stitches
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానం ఎక్కుతుండగా కాస్త తూలిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూజెర్సీలోని మోరిస్టౌన్‌లో మున్సిపల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతుండగా విమానం మెట్లు ఎక్కుతూ ట్రంప్ తడబడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా తూలిపడ్డారు.
President Trump stumbles while walking up the stairs to Air Force One pic.twitter.com/Z9ZNEKkd7z
— Acyn (@Acyn) June 8, 2025
Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో
గతంలో జో బైడెన్ కూడా విమానం ఎక్కుతూ తూలిపడటండంతో ఆయన్ని ట్రంప్‌తో పోలుస్తూ ఎగతాళిగా పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ స్థానంలో బైడెన్ ఉంటే ఇప్పటికే అన్ని న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేదంటూ ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ట్రంప్ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు కాబట్టి ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడిగా భావిస్తున్నాని చెప్పాడు. గతంలో బెడెన్ ఇలాగే తూలిపడ్డప్పుడు ఆయన వీడియోను పదేపదే చూపించిన మీడియా ఇప్పుడు ఎందుకు నిశబ్దంగా ఉన్నాయో అంటూ రాసుకొచ్చాడు.
Also Read: 70ఏళ్లు సహజీవనం.. 90ఏళ్లకు పెళ్లి చేసుకున్న వృద్ధ జంట(Viral Video)
ఇదిలాఉండగా 2021 జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు విమానం దగ్గరకు వచ్చారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతుండగా వరుసగా మూడుసార్లు జారిపడిపోయాడు. 2024లో కూడా ఇలాగే విమానం ఎక్కుతూ జారిపడ్డారు. దీంతో బైడెన్‌కు వృద్ధాప్య సమస్యలు ఉన్నాయని.. జ్ఞాపకశక్తి కూడా క్షీణించిందని ట్రంప్ కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు ట్రంప్ జారిపడటం మరోసారి చర్చనీయం అవుతోంది.
Also read: భారీ భూకంపం.. ధ్వంసమైన బిల్డింగ్‌లు, బద్ధలైన రోడ్లు - వణికించే వీడియోలు
President Trump stumbles while walking up the stairs to Air Force One pic.twitter.com/Z9ZNEKkd7z
— Acyn (@Acyn) June 8, 2025