Bangladesh: భగ్గుమంటున్న బంగ్లాదేశ్.. యూనస్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే!

మాజీ ప్రధాని షేక్ హసీనా గతేడాది జమాతే ఇ ఇస్లామీని పూర్తిగా నిషేధించింది. అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వెంటనే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం జమాతే ఇ ఇస్లామీపై ఉన్న నిషేధాన్నిఎత్తివేసింది. దీంతో బంగ్లాలో మతపరమైన దాడులు చెలరేగాయి.

author-image
By Kusuma
New Update
Potests against  muhammad yunus interim govt in Bangladesh

muhammad yunus

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. తాత్కాలికంగా ఏర్పడిన యూనస్(muhammad-yunus) ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం వల్ల రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయి. గతేడాది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విషయంలో మాజీ ప్రధాని షేక్ హసీనా(sheikh-hasina)పై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇది తీవ్ర హింసకు దారి తీయడంతో హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటోంది. అయితే షేక్ హసీనా రాజీనామా తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమనుగుతాయని ఆ దేశ ప్రజలంతా భావించారు. కానీ పరిస్థితులు అప్పటి కంటే ఇంకా ఉద్రిక్తంగా మారాయి. దీనికి ముఖ్య కారణం మహమ్మద్ యూనస్ చేసిన ఓ చిన్న తప్పు.. ఇప్పుడు ఆ ప్రభుత్వం నేలమట్టమయ్యేలా చేస్తుంది. ప్రజాస్వామ్యంగా భావించి యూనస్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు శాపంగా మారుతోంది. ఇంతకీ ఆ తప్పు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

జమాతే నిషేధమే..

ప్రధానిగా ఉన్న సమయంలో షేక్ హసీనా జమాతే ఇ ఇస్లామీని పూర్తిగా నిషేధించింది. అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వెంటనే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్(muhammad yunus bangladesh) తాత్కాలిక ప్రభుత్వం జమాతే ఇ ఇస్లామీపై నిషేధాన్నిఎత్తివేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడటానికి ఈ నిషేధాన్ని ఎత్తివేయడమే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే జమాతే -ఇ -ఇస్లామీ అనేది ఖిలాఫత్ దేశం కోసం వాదించే ఒక మౌలికవాద సంస్థ. ఈ సంస్థ పాకిస్తాన్‌‌కు సపోర్ట్‌గా ఉంటుంది. ఇస్లాం మతంపై ఇష్టంగా ఉంటుంది. ఈ కారణంగానే బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అయితే హిందువులను ద్వేషించే  జమాత్ ఇ ఇస్లామీపై నిషేధాన్ని గతేడాది ఆగస్టు 8వ తేదీన యూనస్ ఎత్తివేశారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో మతతత్వం పెరిగి.. హిందువులపై దాడులు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Telangana: న్యూఇయర్‌ వేడుకలపై సజ్జనార్ సంచలన ప్రకటన.. రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

మాజీ ప్రధాని షేక్ హసీనా గతేడాది ఆగస్టు 1న 'జమాతే- ఇ- ఇస్లామీ' దాని విద్యార్థి విభాగం 'ఇస్లామీ ఛత్ర శిబిర్'పై నిషేధం విధించారు. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 150 మందికి పైగా మరణించగా.. ఈ హింసల వెనుక జమాత్ ఇ ఇస్లామీ సంస్థల ప్రమేయం ఉందని భావించిన షేక్ హసీనా ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద వాటిని నిషేధించింది. 1941లో స్థాపించిన ఈ సంస్థ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉందని, ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పనిచేస్తుందని హసీనా ప్రభుత్వం తెలిపింది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కూడా ఈ సంస్థ పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇచ్చి లక్షలాది మంది మరణాలకు కారణమైందని పేర్కొంది. ఈ క్రమంలోనే 2013లో బంగ్లాదేశ్ కోర్టు ఈ సంస్థ నియమాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. షేక్ హసీనా 2024 ఆగస్టు 5న రాజీనామా చేసి భారత్‌కు వెళ్లగా.. అక్కడికి మూడు రోజుల తర్వాత ఆగస్టు 8న యూనస్ ప్రభుత్వం ఈ జమాతే ఇ ఇస్లామి నిషేధాన్ని ఎత్తివేసింది. 

ఇది కూడా చూడండి: YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

జమాతే సంస్థ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేయలేదని, షేక్ హసీనా ప్రభుత్వం చేసిన ఆరోపణలు అబద్ధమని యూనస్ ప్రభుత్వం పేర్కొంది. జమాతే ఇ ఇస్లామీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనదని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే హక్కు దానికి ఉందని ప్రభుత్వం తరపున యూనస్ వాదించారు. అయితే నిజానికి జమాతే ఒక రాడికల్ ఇస్లామిక్ సంస్థ. ఇది బంగ్లాదేశ్‌ను షరియా చట్టం కింద దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. దీని విద్యార్థి సమూహం శిబిర్ కూడా చాలా హింసాత్మకంగా ఉంది. ఇది శత్రువులను చంపడంతో పాటు మత ఘర్షణలను ప్రేరేపిస్తుంది. అలాగే తప్పుడు వార్తలను ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ సంస్థ హిందువులను ద్వేషిస్తుంది. దీని సభ్యులు 50 కంటే ఎక్కువ హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు1,500 కంటే ఎక్కువ హిందూ ఇళ్లు, దుకాణాలను తగలబెట్టినట్లు 2013 యుద్ధ నేర తీర్పు తెలిపింది. మహమ్మద్ యూనస్ నిషేధం ఎత్తివేసిన తర్వాత ఢాకాలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి తీవ్రవాదాన్ని వ్యాప్తి చేశారు. 

యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో తీవ్రవాద గ్రూపులు బలంగా మారాయి. ఇవి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, భద్రత, ప్రజా ఐక్యతను పూర్తిగా దెబ్బతీశాయి. ఈ నిషేధం వల్ల హిందువులు ఎక్కువగా నష్టపోయారు. హిందువులనే టార్గెట్ చేసి ఇళ్లు, దేవాలయాలపై దాడులు చేశారు. రాజకీయాల పేరుతో మతపరమైన దాడులు చేశారు. వీటితో పాటు దీపు దాస్‌ హత్యకు జమాత్ ఇ ఇస్లామీ సంస్థ కారణమని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి. దీని వెనుక జమాత్ హస్తం ఉందని ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలపై దాడులు పెరగడంతో పాటుు హిందూ స్థావరాలలో దహనం, మహిళలపై హింస, బలవంతపు వలసలు వంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. హిందువులకు జమాత్ ఒక శత్రువుగా మారింది. యూనస్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రభుత్వం నేలమట్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో అట్టడుగుతున్న పరిస్థితులు.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు!

Advertisment
తాజా కథనాలు