Bangladesh: బంగ్లాదేశ్‌లో అట్టడుగుతున్న పరిస్థితులు.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు!

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ రద్దు అయ్యింది.

New Update
Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ రద్దు అయ్యింది. దీనికి ముఖ్య కారణం కూడా ఆందోళనకారులు దాడులకు పాల్పడమేనని తెలుస్తోంది. బంగ్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు ఫరూక్ మహ్మద్ సజ్జాద్ ఉద్దీన్(జేమ్స్) సంగీత కచేరీ ఢాకాలో జరగాల్సి ఉంది. అయితే భారీ సంఖ్యలో అక్కడికి వచ్చిన వారిలో ఆందోళనకారులు కూడా ఉన్నారు. ఈ ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా వేదికపై దాడి దిగింది. వేదికపై ఉన్న కుర్చీలు, మైక్‌లు, లైటింగ్ సెట్స్, ఇతర సంగీత పరికరాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో కళాకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కచేరీని వెంటనే రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 

ఇది కూడా చూడండి: Telangana: న్యూఇయర్‌ వేడుకలపై సజ్జనార్ సంచలన ప్రకటన.. రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

ఇది కూడా చూడండి: YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి..

ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. కేవలం సంగీత కార్యక్రమాలే కాకుండా, సాంస్కృతిక కేంద్రాలు, విగ్రహాలు, ప్రజా కట్టడాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. కొందరు మతోన్మాద శక్తులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడి వల్ల కచేరి రద్దు కావడంతో జేమ్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఢాకా వీధులు ఇప్పుడు భయాందోళనలతో నిండిపోయాయని అంటున్నారు. అయితే జేమ్స్ బంగ్లాదేశ్ గాయకుడు, -గేయ రచయిత, గిటారిస్ట్, స్వరకర్త, నేపథ్య గాయకుడు అని కూడా పిలుస్తారు. అతను 'గ్యాంగ్‌స్టర్' చిత్రంలోని 'భీగీ భీగీ', 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' చిత్రంలోని 'అల్విడా' వంటి అనేక హిట్ హిందీ సినిమా పాటలను పాడాడు. అతను బంగ్లాదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందాడు. 

Advertisment
తాజా కథనాలు