Mumbai Politician: మద్యం మత్తులో రెచ్చిపోయిన ప్రముఖ నేత కుమారుడు.. నటితో అసభ్య ప్రవర్తన

మహారాష్ట్రలోని ముంబైలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నేత జావేద్ షేక్ కొడుకు రాహిల్ జావేద్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నటి రాజశ్రీ మోరేతో అసభ్యంగా ప్రవర్తించాడు.

New Update
Drunk, semi naked son of Mumbai politician abuses influencer on camera

Drunk, semi naked son of Mumbai politician abuses influencer on camera

మహారాష్ట్రలోని ముంబైలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నేత జావేద్ షేక్ కొడుకు రాహిల్ జావేద్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నటి రాజశ్రీ మోరేతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి బూతులు తిట్టాడు. తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని ఆమె అడిగితే.. కావాలంటే డబ్బులు తీసుకో అంటూ బెదిరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Also Read :  అమ్మో.. రామయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?

Mumbai Politician Abuses Influencer On Camera

Also Read: వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్‌ జావేద్‌ పీకలదాకా మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో చోటుకి వెళ్తుండగా.. దారిలో నటి రాజశ్రీ మోరే కారును ఢీకొట్టాడు. దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. తన కారులో అర్ధనగ్నంగా ఉన్న రాహిల్.. రాజశ్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీకు మా నాన్న ఎవరో తెలుసా ? మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అంటూ బెదిరించాడు.  చివరికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వాళ్లతో కూడా రాహిల్ ఘర్షణకు దిగాడు. 

Also read:  ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!

దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు రాజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఇటీవ ఆమె చేసిన వ్యాఖ్యలు చేసింది. అందుకే తనని MNS కార్యకర్తలు టార్గెట్ చేశారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Also Read :  దంచికొడుతున్న వర్షం..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

maharashtra | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు