/rtv/media/media_files/2025/07/07/ranbir-kapoor-ramayana-fees-revealed-2025-07-07-18-27-02.jpg)
Ranbir Kapoor's Ramayana Fees Revealed
బాలీవుడు డైరెక్టర్ నితేశ్ తివార్ దర్శకత్వంలో రామాయణ చిత్రం తెరకెక్కిస్తో్న్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కీలక అప్‌డేట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రామయణ సినిమాకు నటీనటులు భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రావడంతో.. రణ్‌బీర్ కపూర్ ఒక్కో పార్ట్‌కు రూ.75 కోట్లు చొప్పున రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: నా వద్ద అవి లేవని చెప్పా.. తప్పేముంది: కంగనా రనౌత్
Also Read : బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
Ranbir Kapoor's Ramayana Fees Revealed
అలాగే నటి సాయిపల్లవి మొత్తం రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు నితేశ్ తివారీ దర్శకుడిగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన చిల్లర్ పార్టీ, దంగల్, చిఛోరే వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. దంగల్ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వసూలు చేసి.. భారత్‌లోనే అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
Also Read: ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!
ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో రామాయణ చిత్రం రావడంతో సిని ప్రియులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు రూ.1600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం రూ.900 కోట్లతో.. రెండోది రూ.700 కోట్లతో రానుందని టాక్. ఇది నిజమని తేలిదే దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణ చిత్రం నిలుస్తుంది. ఇక 2026 దీపావళికి మొదటి పార్ట్, రెండో పార్ట్ 2027 దీపావళికి రానుంది. ఈ చిత్రంలో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read : మంత్రి పొంగులేటికి బిగ్ షాక్ .. బిల్డర్లకు కోర్టు నోటీసులు!
telugu-news | rtv-news | ramayana-movie | ranbeer-kapoor | sai pallavi