Anurag Thakur: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా నిలిచాయి. తొలి అంతరిక్ష యాత్రికుడు హనుమంతుడని ఆయన ఓ విద్యాసంస్థలో పిల్లలతో అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఉన జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయలో జరిగిన జాతీయ రోదసీ దినోత్సవాల్లో ఇది జరిగింది.

author-image
By K Mohan
New Update
first space traveller

First space traveller

బీజేపీ లీడర్, మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ఇటీవల మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా నిలిచాయి. తొలి అంతరిక్ష యాత్రికుడు హనుమంతుడు అని ఆయన ఓ విద్యాసంస్థలో పిల్లలతో అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) లోని ఉన జిల్లాలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయలో జరిగిన జాతీయ రోదసీ దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అంతరిక్షానికి వెళ్లిన మొదటి వ్యక్తి ఎవరు? అని అడిగారు. కొందరు విద్యార్థులు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అని చెప్పారు. అనురాగ్‌ మాట్లాడుతూ, తాను ఆంజనేయుడు అనుకుంటున్నానని చెప్పారు. హనుమంతుడు లంకకు వెళ్లడానికి ఎగిరి వెళ్ళాడని అనురాగ్ ఠాకూర్ పేర్కొంటూ హనుమంతుడిని  మొదటి అంతరిక్ష యాత్రికుడిగా వర్ణించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి వ్యక్తిగా సోవియట్ వ్యోమగామి యూరీ గగారిన్‌ను కాకుండా, హిందూ పురాణాల ప్రకారం 'హనుమంతుడిని' పేర్కొన్నారు. 

Also Read :  ప్రధాని మోదీ ల్యాంచ్ చేసిన ఈ-కారు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Former Union Minister Anurag Thakur Contraversy

ఈ వ్యాఖ్యలపై విమర్శకులు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనురాగ్‌ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. వాస్తవానికి సోవియెట్‌ కాస్మొనాట్‌ గగారిన్‌ 1961లో అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సైన్స్‌కు, పురాణాలకు మధ్య ఉన్న తేడాను పిల్లలకు తప్పుగా బోధిస్తున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ విద్యా వ్యవస్థలో శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A (H) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం దేశ పౌరుల కర్తవ్యమని గుర్తు చేశారు. ఠాకూర్ వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను వక్రీకరించి, మతపరమైన విశ్వాసాలను వాస్తవాలుగా చూపుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అధికార బీజేపీ(BJP) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనురాగ్ ఠాకూర్ గతంలోనూ 'దేశ ద్రోహులను కాల్చిపారేయండి' ('దేశ్ కే గద్దారోం కో, గోలీ మారో సాలే కో') అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. 

Also Read :  కొండల్లో చిక్కుకున్న వందలాది టూరిస్టులు.. విరిగిపడ్డ కొండచరియలు

Advertisment
తాజా కథనాలు