Syria: సిరియాలో ఉగ్రదాడి, మసీదులో పేలిన బాంబు.. 8 మంది మృతి

సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
8 killed, over 20 injured in explosion in Syria's Homs mosque during Friday prayers

8 killed, over 20 injured in explosion in Syria's Homs mosque during Friday prayers

సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మసీదు లోపల మూడు IED బాంబులు అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించాలి.. కేంద్రానికి సూచించిన హైకోర్టు

ఈ ఘటనపై స్పందించిన సిరియన్ విదేశాంగ మంత్రి దీన్ని ఉగ్రదాడిగా ప్రకటించింది. సిరియా ప్రజలపై జరిపిన పిరికిపంద చర్యగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశం కట్టుబడి ఉందని పేర్కొంది. భద్రతను మరింత పెంచుతామని, ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అలాగే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు పేర్కొంది. 

Also Read: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు, దేశం అన్ని మతాలకు చెందిందంటూ పిలుపు

గతేడాది సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్ అసాద్‌ దేశం నుంచి రష్యాకు పారిపోయిన తర్వాత వరుసగా దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ షారా నేతృత్వంలోని హయాత్ తహ్రీర్‌ అల్ షామ్ అనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌తో సహా మరికొందరు తిరుగుబాటు దారులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అలవైట్ కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకోని ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు