Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించాలి.. కేంద్రానికి సూచించిన హైకోర్టు

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడటం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో మద్రాస్‌ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. కేంద్రం కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

New Update
Madras High Court Suggests Centre to Consider Australia-Style Social Media Ban for Children Under 16

Madras High Court Suggests Centre to Consider Australia-Style Social Media Ban for Children Under 16

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడటం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే భారత్‌లో మద్రాస్‌ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలపై ఆస్ట్రేలియా తరహా సోషల్ మీడియా బ్యాన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని సూచనలు చేసింది. మైనర్లకు అసభ్యకర కంటెంట్‌ సోషల్‌ మీడియాలో తేలికగా దొరుకుతోందనే అంశానికి సంబంధించి గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామక్రిష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 

Also Read: విద్యార్థులు స్క్రీన్‌ టైమ్ తగ్గించాలి.. న్యూస్ పేపర్లు చదవాలి: ప్రభుత్వం సంచలన నిర్ణయం

సోషల్ మీడియాలో అసభ్యకరమైన, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితాలు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా అనుసరిస్తున్న సోషల్ మీడియా కనీస వయస్సు విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. 

Also read: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు, దేశం అన్ని మతాలకు చెందిందంటూ పిలుపు

ఇదిలాఉండగా 16 ఏళ్ల లోపు మైనర్లపై సోషల్ మీడియాను నిషేధించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ చట్టం ప్రకారం అక్కడ16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్‌ను క్రియేట్‌ చేయలేరు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, రెడిట్ లాంటి సంస్థలకు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సొంతంగా సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్‌ చేయడాన్ని నివారించాలని ఆదేశించింది. ఎట్టకేలకు ఈ చట్టం ఈ ఏడాది డిసెంబర్‌ 10 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్‌లో కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని పలువురు నిపుణులు కూడా సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొందరు నెటిజన్లు దీన్ని సమర్థిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. 

Advertisment
తాజా కథనాలు