/rtv/media/media_files/2025/04/21/xWbbx1VLizWFcbcqUBAL.jpg)
40 students from Bihar's 'IIT village' clear JEE Main 2025
ఇటీవల జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. కనీస కటాఫ్ స్కోర్ సాధించిన 2,50,236 మంది విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయనున్నారు. అయితే దీనికి క్వాలిఫై అయిన వాళ్లలో 40 మందికి పైగా విద్యార్థులు ఒకే గ్రామానికి చెందినవారు కావడం విశేషం. బీహార్‌లోని గయ అనే జిల్లాలో ఐఐటీ విలేజ్‌గా పేరుపొందిన పఠ్వాఠోలీ నుంచి వాళ్లందరూ ఉత్తీర్ణత సాధించారు. వీళ్లలో 28 మంది వృక్ష సంస్థాన్ కోచింగ్ సెంటర్ నుంచి శిక్షణ పొందిన వారు కావడం గమనార్హం.
Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!
Also Read : ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!
Bihar's 'IIT village' Clear JEE Main 2025
1991లోనే పఠ్వాఠోలీకి ఐఐటీ వీలేజ్‌గా పేరు పొందడానికి బీజం పడింది. ఈ గ్రామం నుంచి 1991లో మొదటిసారిగా జితేంద్ర పఠ్వా అనే అతను ఐఐటీలో సీటు సాధించారు. ఆ తర్వాత జితేంద్ర మంచి ఉద్యోగం సంపాదించారు. అమెరికా వెళ్లిపోయారు. తనలాగే మిగతావారు కూడా ఎదగాలని Vriksh We The Change అనే పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించారు. అప్పటినుంచి ఆ ఊరిలో ప్రతి ఇంట్లో కూడా ఐఐటీ పదం వినిపిస్తోంది
20 వేల మంది ఉన్న ఈ గ్రామాన్ని గతంలో మాంచెస్టర్ ఆఫ్ బిహార్‌గా కూడా పిలిచేవారు. వస్త్ర పరిశ్రమలు, చేనేత పని చేసుకునేవాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం ఆ ఊరు ఇంజినీర్లకు నిలయంగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడి కుటుంబాలు చేనేత పని మీదే ఆధారపడిఉన్నాయి. కానీ వాళ్ల పిల్లలు మాత్రం విద్యారంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. 2013లో ప్రారంభమైన వృక్ష సంస్థాన్‌లో ఐఐటీ చదవాలనుకునేవాళ్లకి ప్రీగా కోచింగ్ ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్లు అందించే నిధులతో మెటిరియల్స్ అందిస్తున్నారు.
Also Read : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్
Also Read : చిన్నారిని కాపాడిన దిశా పటాని అక్క .. ఈ విషయం తెలుసుకుంటే సెల్యూట్ చేస్తారు
ఢిల్లీ, ముంబయిలో ఉండేవారు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు కోచింగ్ ఇస్తారు. దీనిపై వృక్ష వేద చెయిన్ ప్రెసిడెంట్ దుబేశ్వర్ ప్రసాద్ మాట్లాడారు. '' చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో తమ పిల్లలను పట్టణాలకు పంపించి చదివించలేరు. అందుకే మేము వృక్ష వేద చెయిన్‌ను ప్రారంభించాం. లైబ్రరీ మోడల్‌ను ఏర్పాటు చేశామని'' తెలిపారు. పదో తరగతి కన్నా ఎక్కువ చదివించడమే కష్టమని భావించే ఆ గ్రామంలో ఇప్పుడు బాలికలు కూడా ఉన్నత విద్యవైపు వెళ్లేందుకు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం మరికొందరు విద్యార్థులు నీట్ వైపు కూడా మొగ్గుచూపుతున్నారు.
rtv-news | jee-mains | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | jee-advanced