TG High Court: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్

చెన్నమనేని రమేష్ వారసత్వ కేసులో తెలంగాణ హైకోర్ట తీర్పు ప్రకారం అతను ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షల డీడీ ఇచ్చారు. తప్పుడు పత్రాలు సమర్పించి ఆది శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నట్లు 2024 డిసెంబర్‌లో హైకోర్టు తేల్చి చెప్పింది.

New Update
MLA adi srinivas

ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్‌కు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రూ.25 లక్షలు అందజేశారు. ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ చెన్నమనేని రమేష్‌పై 15ఏళ్ల న్యాయ పోరటంలో గెలిచిన విషయం తెలిసిందే. జర్మన్ పౌరసత్యం ఉన్న చెన్నమనేని రమేష్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని 2024 డిసెంబర్ 9న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆది శ్రీనివాస్ చేన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై గత దశాబ్ద కాలంగా చేస్తున్న న్యాయపోరాటంలో విజయం సాధించారు.

Also Read :  దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ క్వాలిఫై

Also Read :  సింగర్ సునీత ఇలాంటిదా..! కంటెస్టెంట్ ప్రవస్తి మాటలు వింటే మతిపోతుంది..

జర్మన్ పౌరసత్వంతో వేములవాడ ఎమ్మెల్యేగా

కోర్టు తీర్పులో భాగంగా 4 సార్లు ఎమ్మెల్యేగా కాకుండా ఆది శ్రీనివాస్ అవకాశాలకు గండి కొట్టిన చెన్నమనేని రమేష్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు మరో రూ.5 లక్షలు లీగల్ సెల్‌కు ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. సోమవారం చెన్నమనేని రమేష్ రూ.25 లక్షలు డీడీ రూపంలో న్యాయవాదుల ముందు చెల్లించారు. ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై ఐదేళ్ల పాటు విచారణ అనంతరం జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తీర్పు వెలువరించారు.

Also read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు?

హైదారాబాద్ హైకోర్టులో ఆది శ్రీనివాస్ తరుపున సీనియర్ కౌన్సిల్ వి.రవికిరణ్ రావు, వి .రోహిత్ రావు వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడని హైకోర్టు తేల్చి చెప్పింది. 2009 నుంచి 20ఏళ్లపాటు చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం కారణంగా 2019లో చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర నోటిఫికేషన్ పైన చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాకున్నా 15 ఏళ్ల పాటు భారత దేశ చట్ట సభల్లో సభ్యుడిగా కొనసాగాడని 2024 డిసెంబర్‌లో చెప్పింది.

Also Read :  ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!

 

telangana-high-court | latest-telugu-news | whip adi srinivas | Chennamaneni Ramesh | Big shock for BRS leaders | Chennamaneni Ramesh | Aadi Srinivas | latest telangana news | telangana news live | telangana news today | telangana news live updates | breaking news in telugu | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు