/rtv/media/media_files/2025/05/22/pe9uxBybeoUjoq474Qk6.jpg)
3,000 Agniveers braved Pak assault in Operation Sindoor, guarded key installations
Agniveers in Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్(India Operation Sindoor) పేరుతో పాక్(Pakistan), POKలోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో నేలకూల్చేసిందే. అయితే ఈ ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. సైన్యంలో కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
Also Read: ప్రకృతిని నాశనం చేస్తున్నారు కదరా.. 44 వేల ఎకరాల అడవులను కోల్పోయిన భారత్..
3 వేల మంది అగ్నివీరులు..
ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్‌లో దాదాపు 150-200 మంది చొప్పున మొత్తం 3 వేల మంది అగ్నివీరులు ఈ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నారని సదరు వర్గాలు తెలిపాయి. వీళ్లందరూ కూడా సరిహద్దుల్లో పలు కీలకమైన సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌లో విధులు నిర్వహించారు. ఉద్రిక్తతల సమయంలో సాధారణ సైనికుల్లాగే ముందిడి పోరాడారు అగ్నివీరులు.
Also Read: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు
పాకిస్థాన్ నుంచి వచ్చిన మిసైల్స్, డ్రోన్లను ఎప్పటికప్పుడూ తిప్పికొడుతూ సమర్థంగా విధులు నిర్వహించారు. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణుల గన్స్ అమర్చినటువంటి భారీ వాహనాలకు డ్రైవర్లుగా కూడా అగ్నివీరులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని సదరు వర్గాలు తెలిపాయి.
Also Read: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం
Also Read: ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు..
telugu-news | rtv-news | operation Sindoor | Indian Army | agniveer