Rain havoc in Delhi : ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు..

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి.  భారీ వడగళ్ల వర్షాలతో రాజదానిలో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాలిదుమారంతో చెట్లు కూలిపోయి, వీధులు జలమయమయ్యాయి.

New Update
Rain havoc in Delhi

Rain havoc in Delhi

Rain havoc in Delhi : దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి.  భారీ వడగళ్ల వర్షాలతో రాజదానిలో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాలిదుమారంతో చెట్లు కూలిపోయి, వీధులు జలమయమయ్యాయి. ఢిల్లీలో  బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ వర్షం, వడగళ్ల వానలు, బలమైన గాలులతో ఒక్కసారిగా వాతావరణం బీభత్సంగా మారింది. పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ-ఘజియాబాద్, ఢిల్లీ-గురుగ్రామ్ వంటి కీలక రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దాదారి భాంగల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులు, టవర్లు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

ఇక మరో వైపు ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా విమానాలు దెబ్బతిన్నాయి. విమాన రవాణా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎల్లో లైన్ ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకున్నారు. అక్షర్ధామ్ ఫ్లైఓవర్ సమీపంలో, సికంద్రా రోడ్, ITOకి దగ్గరున్న తిలక్ వంతెన తో పాటు  నగరంలోని అనేక ప్రదేశాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  ఉత్తర ఢిల్లీ నుండి దక్షిణ-ఆగ్నేయం వైపంతా మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షాలు పడ్డాయని, దీని వలన దుమ్ము తుఫాను, బలమైన గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

నిన్న ఢిల్లీలో కురిసిన ఆకస్మిక వర్షానికి ఏడుగురు చనిపోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై చెట్లు పడటం, భారీగా వీస్తున్న గాలులు, వడగళ్ల వర్షాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక, ఢిల్లీ విమానాశ్రయంలో  భారీ వర్షంతో విమానాల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడింది. ఈదురుగాలులకు విమానాలు ఊగిపోయాయి. పలు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 12 విమానాలను జైపూర్‌కు, ఒక విమానాన్ని ముంబైకి తరలించారు.

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు