Forest: ప్రకృతిని నాశనం చేస్తున్నారు కదరా.. 44 వేల ఎకరాల అడవులను కోల్పోయిన భారత్‌..

మనిషి అత్యాశతో అడవులను నరికేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాడు. భారత్‌ 2024లో 18,200 హెక్టార్ల (44,973 ఎకరాలు) ప్రాథమిక అడవులను కోల్పోయింది. ఈ విషయాన్ని గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌లు వెల్లడించాయి.

New Update
India lost 18,200 hectares of primary forest in 2024, Says Global Forest Watch

India lost 18,200 hectares of primary forest in 2024, Says Global Forest Watch

ప్రకృతి కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుంది. కానీ మనిషి అత్యాశతో సహససిద్ధ అడవులను నరికేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతూనే వస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో ప్రకృతి విపత్తులు తరచుగా సంభవిస్తున్నాయి. అందుకే అంటుంటారు ప్రకృతి కన్నెర్రజేస్తే విలయతాండవమే అని. అయితే తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌ 2024లో 18,200 హెక్టార్ల (44,973 ఎకరాలు) ప్రాథమిక అడవులను కోల్పోయింది. ఈ విషయాన్ని  గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌లు వెల్లడించాయి. 

Also Read: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు

సమాచారం ప్రకారం 2002 నుంచి 2024 వరకు దేశంలో 3,48,000 హెక్టార్ల (8,59,926 ఎకరాలు) తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయింది. ఇక 2023లో 17, 700 హెక్టార్ల (43,737 ఎకరాలు) ప్రాథమిక అడవులు కోల్పోయాయి. ప్రాథమిక అడవులు అనేవి నీటి వడపోత, నిల్వ, కర్బనాలకు గ్రహించడం, నేల సంరక్షణ, వరణలను నియంత్రించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.  

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

2001 నుంచి 2004 మధ్య అస్సాం ఎక్కువగా 3,40,000 హెక్టార్ల చెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మిజోరాం 3,34,000 హెక్టార్లు, నాగాలాండ్‌ 2,69,000 హెక్టార్లు, మణిపుర్‌ 2,55,000 హెక్టార్ల చెట్లను కోల్పోయాయి. దీంతో మొత్తంగా 1.39 మిలియన్ హెక్టార్ల చెట్లకు నష్టం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2015-2020 మధ్య ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన చేసిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 

Also Read: 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..

telugu-news | rtv-news | forest | nature 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు