Terrorists: జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వారినుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

New Update

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తాజాగా షోపియాన్ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వాళ్లనుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. 2 పిస్టల్స్, 4 గ్రనేడ్స్, 43 రౌండ్లు బుల్లెట్‌లు సీజ్ చేసింది. అలాగే ఇతర ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుంది. 

Also Read: హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు

2 Terrorist Associates Arrested

ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అక్కడ భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఇటీవల పలువురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా వాళ్లని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరోవైపు జమ్మూలో ఉంటున్న ఉగ్రవాదులపై కూడా వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 

Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

మరోవైపు పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన భారత ఆర్మీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో ఆయుధాలను కొనుగోలు చేసే అధికారాలను సైన్యానికే అప్పగించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసర సమయాల్లో నేరుగా కొనుగోలు చేసేలా రక్షణ దళాలకు అధికారం కట్టబెట్టింది. మొత్తం రూ.40 వేల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయనుంది. 

Also Read: మోదీ, అమిత్ షా కొత్త స్కెచ్.. బీజేపీకి కొత్త బాస్ ఎవరో తెలుసా?

Also Read :  ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన గుజరాత్‌

 

telugu-news | rtv-news | national-news | terrorists | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు