/rtv/media/media_files/2025/05/18/zNLFxUZtl03A4snmQ5Wm.jpg)
Modi, Amit Shah and JP Nadda
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను హైకమాండ్ కొంతకాలం వాయిదా వేసిన సంగతె తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కీలక సమాచారం బయటికొచ్చింది. మే నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో ఇద్దరి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: జ్యోతిపై పూరీ యూట్యూబర్ సంచలన కామెంట్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
వాళ్లలో కేంద్రమంత్రులైన ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా ఓబీసీ వర్గానికి చెందినవారు. అలాగే చాలాకాలంగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒడిశాలో బీజేపీ గెలిచినప్పుడు కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ సీఎం రేసులో ఉన్నారు. కానీ ఆయన కేంద్ర మంత్రిగానే కొనసాగారు. అయితే హైకమాండ్ ధర్మేంద్ర ప్రధాన్‌కు జాతీయ అధ్యక్షుడి పదవి కట్టబెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల సన్నాహాలు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో ప్రారంభించనుంది హైకమాండ్. ఇదిలాఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే రాజకీయంగా ఈ విషయంలో బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
telugu-news | rtv-news | national-news | bjp | bjp-president