World Cancer Day: క్యాన్సర్‌కు ఆత్మ విశ్వాసమే ఆయుధం

నేడు వరల్డ్ క్యాన్సర్ డే. దీనిని నయం చేయాలంటే మొదటి దశలోనే గుర్తించాలని నిపుణులు అంటున్నారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లలాని చెబుతున్నారు. దేశంలో ఏటా 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎందరో పిల్లలు కూడా మృత్యువాత పడుతున్నారు.

New Update
world cancer day

world cancer day Photograph: (world cancer day)

ప్రపంచంలో రోజురోజుకీ క్యాన్సర్ కేసులు (Cancer Cases) పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి (Life Style), ఆరోగ్య అలవాట్ల కారణంగా చాలా మంది ఈ ప్రమాదకరమైన వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ ఏడాది దేశంలో కొత్తగా 15 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించి దాన్ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే కొంత వరకు కేసులు తగ్గుతాయన్నారు.

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

ముందే గుర్తించకపోతే..

దేశంలో నమోదవుతున్న క్యాన్సర్‌ మరణాల్లో ఎక్కువగా పొగాకు, మద్యం, ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్నాయన్నారు. వీటిని ముందే గుర్తించి నయం చేయకపోతే కష్టమే అంటున్నారు. అందరూ కూడా క్యాన్సర్ గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మోదీ సర్కారు క్యాన్సర్ విషయంలో కీలక నిర్ణయాలు ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ మందులను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల ఎందరో పేద వారు క్యాన్సర్ నుంచి బయటపడతారని అంటున్నారు. 

క్యాన్సర్‌ను జయించినవారి సంఖ్య పెరగాలంటే దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. వీటిన్నింటి కంటే మించి ఆత్మ విశ్వాసం ఉండాలన్నారు. మన దేశంలో రోజుకి 200 మంది సర్విక్స్‌ క్యాన్సర్‌తో చనిపోతున్నారని, ఇలా అన్ని చూసుకుంటే దాదాపుగా 1600 మంది చనిపోతున్నారన్నారు. అలాగే అమెరికాలోలాగా.. భారతదేశంలో కూడా క్యాన్సర్‌ను నోటిఫయబుల్‌ డిసీజ్‌‌గా గుర్తించాలన్నారు. దీనివల్ల ఎంతమంది క్యాన్సర్‌ బాధితులున్నారు? ఏయే రకాల క్యాన్సర్లు ఉన్నాయనే? పూర్తి విషయాలు కూడా తెలుస్తాయన్నారు. క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వారిలో చిన్నారులు కూడా ఎక్కువగానే ఉన్నారని దత్తాత్రేయుడు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు