/rtv/media/media_files/2025/02/04/xZ7wpjVFiPUde6swDyMf.png)
Non-Vegetarian
Non-Vegetarias : భారతదేశం భిన్నమతాలు, విభిన్న జాతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. ఆయా జాతులు, ప్రాంతాలు, మతాచారాలను బట్టి వారివారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాంసాహారాన్ని ఎక్కువ తింటే మరికొన్ని ప్రాంతాల్లో శాఖాహారానికి జై కొడుతారు. ముఖ్యంగా కరోనా తర్వాత మాంసాహారం తినేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా మాంసాహారాన్ని ఎక్కువగానే తింటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాంసాహారం తినేవారి విషయంలో కొంత తేడాలున్నా మనవాళ్లు మాంసం ప్రియులే అనడంలో సందేహం లేదు. అయితే మాంసం తినడంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ కొంత తేడా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని తప్ప ప్రతి పండుగకు మాంసం తప్పనిసరి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ముఖ్యమైన పండుగలకు ముక్క ఉండాల్సిందే.
Also Read: యూఎస్ఏఐడీ పై మండిపడుతున్న ట్రంప్ అండ్ మస్క్..ఎందుకో తెలుసా!
మాంసాహారులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. మన దేశంలో మాంసాహారులు ఎంతమంది శాకాహారులు ఎంతమంది అన్న వివరాలను వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మనదేశంలో మాంసహారం తినేవారిలో ఆడవారితే పై చేయి అని తేలింది. సుమారు 78 శాతం మహిళలు 70 శాతం మంది పురుషులు వారానికి ఒకసారి చేపలు, చికెన్, గుడ్లు లేదా మాంసాన్ని తీసుకుంటారని నిర్ధారించింది.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
ఇక దేశవ్యాప్తంగా మాంసాహారం ఎక్కువగా తినే రాష్ర్టా్ల్లో నాగాలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు సుమారు 99.8 శాతం అంటే దాదాపు నూటికి నూరుశాతం మంది మాంసాహారులే. గతంలో చేసిన సర్వేల్లో నాగాలాండ్ వారు మాంసాహార ప్రియులని వెల్లడైంది. వీరు కేవలం చికెన్, మటన్ మాత్రమే కాక ఇతర జంతువుల మాంసాన్ని కూడా తింటారని తేలింది. ఇక వారి తర్వాత రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. పశ్చిమ బెంగాల్లో 99.3% మంది మాంసాహారం తీసుకుంటారు. ఇక 99.1 శాతం మంది మాంసం తినేవారితో మూడవ స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
ఇక తెలుగు రాష్ట్రాలలో మాంసాహారాన్ని ఎక్కువగానే తింటారు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే తెలంగాణ వారికి పండుగైన, సంతోషమైన, బాధ అయిన మందు, మాంసం ఉండాల్సిందే అంటారు. అయితే ఈ సర్వేలో మాత్రం తెలంగాణ వారికంటే ఆంధ్రప్రదేశ్ వారే మాంసాహారం తినడంలో ముందున్నారు. ఏపీలో 98.25 శాతం మంది మాంసం తింటారు. దేశంలో వీరిది నాలుగవ స్థానం. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారం తినే వారి సంఖ్య తక్కువే. తెలంగాణలో 98.8 శాతం మంది పురుషులు 98.6% మంది మహిళలు మాంసాహారులు. అంటే తెలంగాది ఐదవస్థానం. ఆరవస్థానంలో 97.65 శాతం మంది మాంసాహారులతో తమిళనాడు ఉంది. ఇక దేశంలోని దక్షిణ ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే, పంజాబ్‌లో చికెన్, గుడ్లు తినేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక దక్షిణ భారత దేశంలో మాంసాహారం తక్కువగా తినే రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ర్టంలో 81.2 శాతం మంది మాంసాహార ప్రియులు.
Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు