Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

మీన రాశి వారికి ఈరోజు కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ కథనంలో..

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేష రాశి వారు ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు,ఆభరణాలను పొందుతారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నప్పటికీ సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది.

Also Read: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

వృషరాశి వారికి నేడు స్థాన చలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం . కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సివస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

మిథున రాశి వారు ఈరోజు నూతన వస్తు, వస్త్ర,వాహన,ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది.శుభవార్తలు వింటారు. శుభకార్యప్రయత్నాలు సులభంగా నేర్చుకుంటారు.బంధు మిత్రులతో కలిసి విందులు,వినోదాల్లో పాల్గొంటారు.

Also Read: Telangana: తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్‌ లాగానే!

కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది.ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.ధననష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

సింహరాశి వారుఈరోజు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది.అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు.చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి.

కన్య రాశి వారికి స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ,ఉద్యోగ రంగాల్లో అభివృ్ది ఉంటుంది.ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.

తుల రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ది ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.రాజకీయరంగంలోని వారికి,క్రీడాకారులకు అద్భుతమైనఅవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు,మిత్రులు కలుస్తారు.

వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి.బంధు  మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది.రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంంలో మనశ్వాంతి లోపిస్తుంది.

ధనస్సు రాశి వారిరిక ఈరోజు వృత్తి ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ది ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు.బంధు మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.

మకర రాశి వారు ఈరోజు నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదోక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది.

కుంభ రాశి వారు నేడు నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

మీన రాశి వారికి ఈరోజు కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి.శత్రుబాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు,ఆభరణాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.

Also Raed: Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..!

Also Read: Watch Video: మాతృభాషలో రాసేందుకు తిప్పలు పడ్డ రాష్ట్ర మంత్రి.. వీడియో వైరల్

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు