/rtv/media/media_files/2025/07/28/monday-puja-2025-07-28-09-30-11.jpg)
Monday Puja
హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితమై ఉంటుంది. అందులో సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేకంగా కేటాయించబడిన పవిత్రమైన రోజు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు అత్యంత శుభప్రదంగా చెబుతారు. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని తపస్సులతో.. పాటలతో, పూజలతో సేవిస్తూ, ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని యత్నిస్తారు. అయితే శివుడితో పాటు మరికొందరు దేవతలను కూడా ఈ రోజున పూజించటం మతపరంగా ఎంతో ఫలప్రదంగా భావించబడుతుంది. సోమవారం శివుడితోపాటు ఎవరిని పూజించాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read : కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
సోమవారం శివుడితోపాటు..
శివుని నామస్మరణతోపాటు చంద్రదేవుని పూజ కూడా సోమవారం ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది. సోమవారానికి 'సోమ' అనే పదం కూడా చంద్రునినే సూచిస్తుంది. జాతకంలో చంద్రుని బలహీనత కారణంగా మానసిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అశాంతి వంటి సమస్యలు తలెత్తుతాయని నమ్మకం. అందుకే చంద్రదేవుని పూజ ద్వారా మనస్సు ప్రశాంతతను, స్థిరతను పొందవచ్చు. చంద్రుడు శివునికి మస్తకంలో అలంకారంగా ఉండడం వల్ల వీరి పూజను ఒకేరోజున చేయడం మరింత శక్తివంతంగా చెబుతారు. శివుడు తన జడలలో గంగను నిలిపాడు. గంగా దేవి శుద్ధత, పవిత్రతకు చిహ్నం. సోమవారం నాడు గంగమ్మను పూజించడం లేదా గంగ జలంతో శివలింగానికి అభిషేకం చేయడం పవిత్రగా చెబుతారు. ఇది మన పాపాలను తగ్గించేందుకు, శరీర మానసిక శుద్ధికి దోహదపడుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ
అలాగే శివుడికి ప్రీతికరమైన బెల్ ఆకులను సమర్పించడం.. బెల్ చెట్టుకు నీరు పోసి ధూప దీపాలతో పూజించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి. శివుని సతీమణి పార్వతి మాతను కూడా సోమవారం నాడు పూజిస్తారు. శ్రావణ మాస సోమవారాల్లో వివాహం కావలసిన కన్యలు శివ, పార్వతులను కలిసి పూజించి సద్గుణవంతుడైన వరుడు దక్కాలని ప్రార్థిస్తారు. అలాగే వివాహిత స్త్రీలు తమ గృహ శాంతి కోసం ఉపవాసం ఉండి పూజ నిర్వహిస్తారు. శివుడి వాహనం నంది కూడా ఈ రోజు ప్రత్యేక పూజకు పాత్రుడవుతాడు. శివాలయాల్లో నంది చెవిలో కోరికను గుసగుసలాడితే.. అది శివుడివరకు చేరుతుందని నమ్మకం. ఈ విధంగా సోమవారం రోజున శివునితోపాటు చంద్రుడు, గంగమ్మ, పార్వతి దేవి, నంది, బెల్ చెట్టు వంటి దేవతా స్వరూపాలను పూజించడం సంపూర్ణ భక్తిని, శుభఫలితాలను ప్రసాదిస్తుంది. శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించే భక్తులకు ఆయుష్షు, ఆరోగ్యం, సంపద, మోక్షం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also Read : అమ్మతనాన్ని అమ్ముకుంటున్న IVF సెంటర్లు.. ఆ చీకటి దందా షాకింగ్ సీక్రెట్స్ ఇవే!
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: రాఖీ పండుగన బహుమతుల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
( shiva Latest News | puja | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style )