/rtv/media/media_files/2025/07/27/standing-desk-2025-07-27-15-22-15.jpg)
Standing desk
ఈ ఆధునిక జీవనశైలిలో ఎక్కువ సమయం కూర్చునే అలవాటు ఆనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఇంటి నుంచి పని చేసే ధోరణి, ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గిపోతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం 1 నుండి 2 గంటల పాటు స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడం సాధ్యమవుతుంది. మధ్యమధ్యలో తేలికపాటి కదలికలు చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. స్టాండింగ్ డెస్క్ డయాబెటిస్‌నను ఎలా తగ్గిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
స్టాండింగ్ డయాబెటిస్‌ను పెంచుతుందా..?
అధ్యయనాల ప్రకారం.. కూర్చున్న స్థితిలో ఎక్కువసేపు ఉండటం శరీరంలోని గ్లూకోజ్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మందగించిస్తుంది. దీని వల్ల శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా స్పందించలేకపోతుంది, ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది. ఇది డయాబెటిస్‌ను పెంచుతుంది. అయితే పని చేసే సమయంలో ప్రతి గంటకు కనీసం 30 నిమిషాలు నిలబడడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మెరుగవుతుంది. మాంసకండరాలు సక్రియంగా మారడం ద్వారా రక్తంలో ఉన్న చక్కెరను శరీరం బాగా వినియోగించుకుంటుంది. కేవలం నిలబడటం మాత్రమే కాదు.. తక్కువ శ్రమతో కూడిన కదలికలు కూడా అవసరం. పని మధ్యలో కొన్ని నిమిషాలు నడక, నిలబడి చేయగలిగే చిన్న వ్యాయామాలు, సాగదీయడాలు చేయడం వల్ల శరీర జీవక్రియ రేటు మెరుగవుతుంది.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఊహించని రీతిలో పెరగకుండా ఉంటాయి. ఇదే తరచూ చేసే అలవాటుగా మారితే.. కొన్ని నెలల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ పునరుద్ధరించబడే అవకాశముంది. స్టాండింగ్ డెస్క్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువసేపు నిలబడకూడదు. ప్రతి రోజూ 60 నుంచి 90 నిమిషాల పాటు నిలబడే అలవాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చిన్న మార్పుగా కనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే డయాబెటిస్‌ను సహజంగా నియంత్రించగల శక్తివంతమైన మార్గంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఒంటరి తనమే గుండెపోటుకు కారణమా..? తీసుకోవలసిన అత్యవసర జాగ్రత్తలు
( diabetes | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | standing )