Devi Navaratri 2025: నేటి నుంచే దేవీ నవరాత్రులు.. ఇలా అమ్మవారిని పూజిస్తే.. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం
దేవీ నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దుర్గాదేవిని పూజించిన తర్వాత లలితా సహస్రనామం పారాయణం చేయాలని అంటున్నారు.