/rtv/media/media_files/2024/12/26/ZoTc1GtkSS4onxfhiuwp.jpg)
CM Revanth Reddy
TG New Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు పొందుతున్న లబ్దిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే 3.50 లక్షల రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంకా 7 లక్షల కార్డులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త కార్డుల ద్వారా సుమారుగా 30 లక్షల మందికి పైగా లబ్దిదారులు ప్రభుత్వ పథకాల పరిధిలోకి రానున్నారు. దీని ద్వారా రేషన్ కార్డు లేక గతంలో పథకాలను పొందలేకపోయిన వారికి ఈసారి పెద్దగా లాభం చేకూరనుంది.
ప్రభుత్వ పథకాల వరాలు..
ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను కూడా రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నూతన కార్డుదారులు ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను పొందడంలో జాప్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి లబ్దిదారుల వివరాలను సేకరించి.. సేవల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో 90.10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. దాదాపు 2.84 కోట్ల మంది వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్దిదారులుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: రాఖీ పండుగన బహుమతుల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇప్పుడు కొత్తగా కార్డులు పొందే కుటుంబాల నుంచి గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మీ, చేయూత తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు నేరుగా లబ్దిదారులకు వెళ్లి వారి వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి, అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ విధానం వల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ నిర్ణయంతో చాలా కాలంగా రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాల నుంచి వంచితులైన వారికి కొత్త వెలుగు కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు సామాజిక సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా మారనున్నాయి.
ఇది కూడా చదవండి: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!
( ration-card | Latest News | Revanth Reddy )